Friday, October 3, 2014

హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్



ఛ ఈ వయసులో కార్టూన్/యానిమేషన్ సినిమాకి ఒక్కడినే వెళ్ళటం ఏమిటి అనుకున్నా. యుఎస్ న్యూస్ లో రివ్యూ బాగుండటం పైగా నా ఫ్లయ్ ట్ కి చాలా టైం ఉండటం తో సర్లే పద అనుకుని ఈ సినిమాకు వెళ్ళాను. 3డి అనుకుని వెళ్ళా కాని ఆ ధియేటర్ లో నార్మల్ ఫార్మాట్ లోనే చూడాల్సి వచ్చింది.
అద్బుతం అమోఘం అని చెప్పక తప్పదు. చాలా రోజుల తర్వాత ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో కూర్చుని చూడాల్సి వచ్చింది. ప్రతీ సీన్ కలర్ ఫుల్ గా చాలా చక్కగా కుదిరాయి. 3డి కాకపోయినా చాలా డెప్త్ తో 3డి చూసిన అనుభూతే కలిగింది. కొన్ని సీన్లు చూస్తూంటే యానిమేషన్ సాధించిన ప్రగతి ప్రస్పుటంగా కనిపిస్తుంది.
హికప్ హీరో.. వైకింగ్ జాతి వాడు.. మిగతా జాతితో కలసి ఓ చక్కని ద్వీపం లో నివసిస్తూంటాడు. అందరు మహా బలవంతులే తను తప్ప. వాళ్ళ నాన్నకి కూడా నమ్మకం ఉండదు. వీరికి ఉన్న ఒకే సమస్య.. డ్రాగన్ దాడి. అవి వచ్చినప్పుడల్లా మంటలు, చంపుకోవడాలు మామూలే. ఈ గొడవ లో హికప్ ని రానివ్వరు. అయినా ఓ సారి ఏలానో చొరబడి ఓ డ్రాగన్ ని అటాక్ చేసి ఓ ఆయుధం ద్వారా బంధిస్తాడు. కాని అది ఎవ్వరు నమ్మరు. దాని కోసం వెదుకుతూ బయలుదేరుతాడు. అది నిస్సహాయ స్తితి లో ఉన్నా చంపలేక దాని బంధనాలు తొలగిస్తాడు. దీని పేరు టూత్ లెస్ ఓ రేర్ జాతి డ్రాగన్. కాని అది ఎగరలేక పోతుంది. ఎలివేటర్ తోక విరిగిపోయి ఉంటుంది. దానికి చేపలు పెట్టి స్నేహం చేస్తాడు. ఎలివేటర్ టైల్ తయారు చేసిస్తాడు. ఆ డ్రాగన్ మీద కూర్చుని ఎలివేటర్ కంట్రోల్ చెయ్యడం ద్వారా తను ఎగురుతాడు.
వాళ్ళ నాన్న ఆదేశం మీద ఓ నలుగురు యువత కు డ్రాగన్ ఫైట్ లో శిక్షణ మొదలవుతుంది. ఓ నాలుగైదు పట్టుబడిన డ్రాగన్ లతో. తను టూత్ లెస్ దగ్గర నేర్చుకున్న ట్రిక్స్ తో అన్నిటిని మచ్చిక చేసుకుని జాతి వారితో హీరో గా కొనియాడబడతాడు, ఆస్ట్రిడ్, హీరోయిన్ తనుకూడా ఫైట్ లో శిక్షణ తీసుకుంటూంటుంది. ఓ రోజు హికప్ ని వెంబడించి రహస్యం తెలుసుకుంటుంది. అనుకోకుండా ఇద్దరు కలసి టూత్ లెస్ మీద కూర్చుని స్వారీ చేస్తారు. అప్పుడ అసలు క్వీన్ డ్రాగన్ గుహ చూస్తారు. మిగతా డ్రాగన్ లు దాని బానిస లని తెలుస్తుంది. దిగిన ఆస్ట్రిడ్, హికప్ చెంప మీద కొడుతుంది ఇది నన్ను కిడ్నాప్ చేసినందుకు అని వెంటనే ముద్దు పెట్టి ఇది మిగతా అన్ని విషయాలకు అని.
వాళ్ళ నాన్న ముందు ఓ డ్రాగన్ ఫైట్ లో ఓడిపోతాడు. అప్పుడు వాళ్ళ నాన్న కి అసలు విషయం తెలిసి క్వీన్ డ్రాగన్ మీద యుద్ధం ప్రకటిస్తాడు. కాని ఓటమి అంచుకొచ్చేస్తాడు. అప్పుడు యువత మిగతా డ్రాగన్ ల తో కలసి క్వీన్ బీ ని చంపేసి, వాటితో కలసి సహ జీవనం సాగించటం తో సినిమా సుఖాంతం అవుతుంది ఓ చివుక్కుమనే విషయంతో.
సినిమా పూర్తవ్వగానే మనస్పూర్తిగా చప్పట్లు కొట్టాను మిగతా వారితో కలసి.
జే బరూచెల్, అమెరికా ఫెరెరా, గెరార్డ్ బట్లర్ ముఖ్య వాయిస్ సపోర్ట్. డ్రాగని లు మాట్లాడ లేదు యాక్షన్ తప్ప.
డ్రీమ్ వర్క్స్ వారి తయారీ. రిలయన్స్ పేరు ఎక్కడా కనబడలేదు. యానిమేషన్ లో ఓ కొత్త వరవడిని సృష్టించగల సినిమా. క్రిష్టోఫర్ సాండర్స్, డీన్ డిబ్లాయిస్ డైరెక్ట్ చేశార్. ఇదే పేరుతో వచ్చిన క్రెసీడా కొవెల్ నవలకి రూపాంతం.
పిల్లల్ని తీసుకుని మరీ వెళ్ళండి.