Friday, February 20, 2015

ప్రొజెక్టర్



కిందపడి దొర్లి నవ్వడం ఈరోజు చూసాను. ముఖ్యంగా చిన్నపిల్లలు నవ్వారు చూడండి ... ROFL ని ప్రాక్టికల్గా చేసి చూపారు. ప్రొజెక్టర్ ఇచ్చిన దాతకు, ప్రతి వారం ఓపిగ్గా కనెక్షన్లు ఇచ్చి సినిమా చూపించే చిన్న పుల్లయ్యగారికి, మంచి సినిమాలు తెచ్చి ఇచ్చిన సోదరుడు మిడుతూరు సురేష్‌రెడ్డి గారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.






ON
CATEGORIES: 

0 వ్యాఖ్యలు

Thursday, February 19, 2015

కధల పోటీలు

బృందావనం కధల పోటీలు ..

బృందావనం తరపున బృందావనం సభ్యులు నివాస ప్రాంతాలల్లో చిన్న పిల్లలికి కధల పోటీ పెట్టాలని అనుకున్నాము ... 

ఉగాది నాడు ఈ పోటీ పెట్టాలని ... నిజానికి ఇది పోటీ కాకపోయినా ... పిల్లలిని encourage చేసేందుకు ఇలా పోటీ అన్న మాట వాడటం జరిగింది ... 

మొత్తం మూడు చోట్ల ఈ కార్యక్రమం నిర్వహించారు 

గీత గారు , ముగ్ధ గారు , తనూజ గారు ముగ్గురు ఈ పోటీలు నిర్వహించారు ... 

మొత్తం మీద ... మాకు కలిగిన అనుభూతి ఏంటంటే ... 

పిల్లలికి కధలు వినాలని, చదవాలని ఆసక్తి ఉంది 

అయితే పేరెంట్స్ అందుకు సంబంధించిన పుస్తకాలు కొని ఇవ్వకుండా ఎక్కువగా టివి అలవాటు చేస్తున్నారు ... 

మేము బృందావనం లో ప్రతి మాసం ఒక పుస్తకం చదువుతాము నెల చివరి వారం ఆ పుస్తకాన్ని ఎవరు ఎ కోణం లోనుంచి అర్ధం చేసుకున్నామో వివరిస్తాము ... 

ఇలాగే ప్రతి ఇంట్లో కనీసం వారానికి ఒక్క కధ పిల్లలికి చెప్పి , తిరిగి వారితో చెప్పించి ఇలా చెప్పిస్తున్నప్పుడు ఇంట్లో వారు అందరు చక్కగా, శ్రద్ధగా ( టివి లు మొబైల్స్ ప్రక్కన పెట్టి ) పిల్లలు చెప్పే కధలు వింటే ... ఆ బంధాలలో ఎంతో మార్పు వస్తుంది ... 

ఈ మొత్తం లో ఒకరిద్దరు పేరెంట్స్ ఆసక్తి చూపించకపోయినా పిల్లలు మాత్రం ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు 
అందరికి బృందావనం తరపున పుస్తకాలు కానుకగా ఇవ్వడం జరిగింది 

ఈ కార్యక్రమం మొత్తం చక్కగా నిర్వహించిన గీత గారికి, ముగ్ధ గారికి, తనూజ గారికి నా తరపున , బృందావనం తరపున కూడా ధన్యవాదాలు 

ఇక గీత గారు నిర్వహించిన పోటీ వివరాలు ... వారి మాటల్లోనే ... ( హైదరాబాద్ లో )

1. మొత్తం 12మంది  పేర్లు ఇచ్చారు 

2. అందులో 7 గురు మాత్రం పాల్గొన్నారు.. మిగతావారు అనేక కారణాల వలన పాల్గొనలేకపోయారు ..

3. వాళ్ళలో ఒక చిన్న బాబు 5 ఏళ్ళు అందుకే వాడికి ఇంగ్లీష్ లో చెప్పే అవకాశం ఇచ్చాను 

4. పిల్లలు శ్రద్దగానే ఉన్నారు వినే ఓపిక పెద్ద వాళ్ళకే లేదు 

5. మంచి పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు అని ఇద్దరు పిల్లలు వచ్చి నాకు థాంక్స్ చెప్పి వెళ్ళారు 

6. కొంత మంది సగం చెప్పారు ఒకరు jumble చేసి చెప్పారు కొంత మంది మధ్య 1, 2 సార్లు ఇంగ్లీష్ పదాలు వాడారు 

7. అన్నిటికంటే బాధ అనిపించింది పేరెంట్స్ ని ఎంతో (గంట సేపు ) బతిమాలితే వినడానికి వచ్చారు 

"ఇదే పేరెంట్స్ దగ్గర ఉండి పిల్లల్ని కెవ్వు కేక పాటలు డాన్సు చేయించిన వాళ్ళు ఉన్నారు 
యశస్వి 
అది వినాయక చవితి ఉత్సవాలలో "

1.యశస్వి ఆవు - పులి కథ "బాల్యం కథలు " బుక్ లోది చెప్పాడు 
పులి ఎదురు చూస్తుంది అని చెప్పడానికి వెయిట్ చేస్తుంది అని చెప్పాడు మోరల్ చెప్పడం మర్చిపోతే మళ్ళీ చెప్పించాము "సత్యం పలికే వాళ్లకి ఎప్పుడు మంచే జరుగుతుంది " అని చెప్పాడు 
ప్రణీత 
2. ప్రణీత "తాను తీసిన గోతిలో " చెప్పింది 
ఒక నక్క ఏనుగు తో స్నేహం చేసినట్టు నటించి దానిని పులి కి ఆహారంగా ఇవ్వాలి అని అనుకుంటుంది 
ఇది గమనించిన కుందేలు అది మంచిది కాదు అని చెపితే ఏమి పర్లేదు అంటుంది అంత పెద్ద ఏనుగు ని ఎలా పడేస్తావు అంటే ఏనుగు కోసం తయారు చేసిన గోతిని చూపిస్తూ పొరపాటున అది కాలు జారి పడుతుంది ఇదంతా అటుది ఇటు , ఇటుది అటు చెప్పింది ఈ పాప "తాను తీసిన గోతిలో తానే పడతారు అనేది కథ నీతి 

3. సృజన్  "జమిందారు - భూస్వామి " కథ చెప్పాడు 
సృజన్ 
ఒక భూస్వామి కింద ఒక రైతు పొలం కౌలుకి తీసుకుంటాడు . కౌలు కింద ఏమి కావాలి అంటే నేల లోపల పండింది మొత్తం నాకు అని చెప్తాడు .. వేరు సెనగ పంట వేయడం వలన అది మొత్తం భూస్వామి కి చెందుతుంది అది తప్పు అని జమిందారు చెప్తారు అలా అడగకూడదు ఎప్పుడైనా డబ్బు రూపం లో అడగాలి అని జమిందార్ చెప్తారు తీర్పు ఇది మొత్తం కథ చెప్పలేదు తెలివిగా ఆలోచించాలి అనేది కథ నీతి 

4. ప్రజ్ఞ (చింటూ ) "గొడ్డలి కథ చెప్పింది 
ధీరజ్ 
కాని సగమే చెప్పింది దురాశ దుఖానికి చేటు అనేది నీతి 
కాని సగం చెప్పడం వలన సత్యం పలికితే మంచి జరుగుతుంది అని చెప్పింది 
సూరజ్ 
5. ధీరజ్ (Borrowed feathers )
చెప్పిన టైటిల్ కి కథ కి సంబంధం లేద

6. సూరజ్ 
కథ మొత్తం ఇంగ్లీష్ లో చెప్పాడు 

7. ఆకాష్ కాకి - గులక రాళ్ళ కథ చెప్పాడు 
తెలివి తో సాధించాలి అనేది నీతి 
ప్రజ్ఞ 


















ఇక ముగ్ధ గారు నిర్వహించిన కధల పోటీల వివరాలు ( హైదరాబాద్ లో )

పదిమంది చిన్నారుల వివరాలు ... వారు చెప్పిన కధలు ... 


1.  సాతిక్య     . 14 సంవత్సరాలు . *ఆలోచనే విజయానికి సోపానం *

2.  ప్రణతి         13సంవత్సరాలు ..  *తెనాలి రామకృష్ణ - దొంగలు *
3.  భువనేశ్      11సంవత్సరాలు *శ్రవణ కుమారుని కధ *

4.  సోనాల్         8సంవత్సరాలు ..  *ఉపకారం * (పావురం - చీమ )

5.  తన్మయి       7సంవత్సరాలు ..  *రాజు - ఏడుగురు కొడుకులు -చేపలు *

6.  పూజిత        6సంవత్సరాలు.  *ఐకమత్యం *

7.  ఉద్భవ్        6సంవత్సరాలు ..  *కుందేలు-సింహం *

8.  చేతన్         5సంవత్సరాలు *కాకి - నీళ్ళు త్రాగడం *

9.  లౌక్య         4సంవత్సరాలు .. *కాకి - నీళ్ళు త్రాగడం *
సాహితి 

10. జుగల్ ప్రీత్   6సంవత్సరాలు. * Rabbit  - Lion * (in English )

తనూజ గారు నిర్వహించిన కధా పోటీ వివరాలు ( బెంగుళూరు )
సంతోష్ 

సమన్విత (5 సం)
ఈ అమ్మయి పావురం,చీమ కథ చెప్పింది.
కథ: చీమ నీటిలో పడితే పావురం నీటిలో ఒక ఆకు వేస్తుంది. .ఆ ఆకు పైకెక్కి చీమ ఒడ్డుకు వస్తుంది.అలా పావురం చీమను కాపాడుతుంది.ఇకొకసారి వేటగాడు పావురాన్ని బాణంతో చంపబోతే,చీమ ఆ వేటగాడి కాలు కొరికి పావురాన్ని రక్షిస్తుంది.
నీతి:ఆపదలో ఉన్నవారికి సహాయం చెయ్యాలి అని చెప్పింది.

ప్రీతిక  (5 సం
ఈ అమ్మయి ఆవు,పులి కథ చెప్పింది.
సాత్విక
కథ: ఒక ఆవు అడవిలో మేత మేస్తోంటే ఒక పులి దాన్ని తింటాను అంటుంది.అప్పుడు ఆ ఆవు నాకు చిన్న దూడ ఉంది అని,,దానికి పాలు ఇచ్చి మంచి బుద్దులు చెప్పి వస్తాను అని అంటుంది.పులి మొదట ఒప్పుకోదు.ఆవు చాలా బతిమాలుకొంటే సరె అంటుంది.దూడకి పాలు ఇచ్చి,యజమాని మాట  వినమని,అందరితో స్నేహంగా ఉండమని,గొడవలు పడవద్దు అని,చెరువుగట్టు మీద ఎగరవద్దు అని చెప్పి పులిదగ్గరకు వచ్చేస్తుంది.పులి,ఆవు మాట తప్పలేదు అని ఆవును తినకుండా వదిలిపెట్టింది.            
నీతి:సత్యమేవ జయతే అని చెప్పింది .

వరున్(4 సం)  (ఈ అబ్బయి మహరాష్ట్ర  అబ్బాయి.ఇంగ్లిష్ లో చెప్పాడు.వాళ్ళ అమ్మ,నాన్న తెలుగు మాట్లడగలరు.)
3 aliens కథ చెప్పాడు.
కథ: మాకు అర్థం కాలేదు.వాళ్ళ అన్న నేర్పించాడు అంట.తరువాత వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పమంటే పాపం వాడికి గుర్తులేదు.వాళ్ళ అన్న ఊరికి వెళ్ళాడంట.అందుకు కథ రాయలేను.
 వేత
నీతి:you shouldnot pick anybodies things

సంతోష్(7 సం)
ఈ అబ్బాయి మిత్రలాభం కథ చెప్పాడు.
సౌజన్య
కథ: ఒక అడవిలో కాకి,ఎలుక,జింక,తాబేలు ఉంటాయి.ఒకసారి వేటగాడు తాబేలును పట్టుకొని వెళ్తుంటాడు,అప్పుడు ఎలుక, మిగిలిన స్నేహితులకి ఒక ఉపాయం(ఇది ఆ అబ్బయికి గుర్తురాక idea అని చెప్పాడు)చెబుతుంది.జింక వేటగాడి దారిలో చనిపోయినట్టు నటిస్తుంది.అప్పుడు వేటగాడు తాబేలును కిందపెట్టి జింక దగ్గరికి వెళ్తుంటాడు.ఆ సమయంలో ఎలుక తాబేలు ఉన్న వలని కొరికేస్తుంది.కాకి కావ్ కావ్ మని అరుస్తుంది,అరుపువిని జింక పారిపోతుంది.అన్ని కలిసి హాయిగా ఉంటాయి.
నీతి:అవసరానికి ఆదుకునే స్నేహితులే నిజమైన స్నేహితులు.

రూప(8 సం) 
ఈ అమ్మాయి ఉపాయం కథ చెప్పింది.
కథ: ఒక బాటసారి వెడుతుంటే ,దొంగలు అతడిని దోచుకోవాలని అనుకుంటారు.అతడి వద్ద ఎమీలేకపోయేసరికి,దొంగల నాయకుడు నువ్వు ఎమి చేస్తుంటావు అని అడుగుతాడు.ఆ బాటసారి నేను ఉపాధ్యాయుడను(ఇది ఆ అమ్మాయి గుర్తురాక Teacher అని చెప్పింది) అంటాడు.అప్పుడు నాయకుడు ఐతే నీకు చాలా తెలివి ఉంటుంది,నేను నీకు ఒక పరీక్ష పెడతాను,నువ్వు సరైన సమాధానం చెబితే నిన్ను వదిలేస్తాము అంటారు.ఒక గుమ్మడికాయ చేతికిచ్చి దాని బరువు ఎంతో చెప్పమంటాడు.ఆ ఉపాధ్యాయుడు ఆలోచించి నీ తలకాయ అంత బరువు ఉంటుంది అని చెబుతాడు.నాయకుడు అతని తెలివికి సంతోషపడి అతడిని వదిలేస్తాడు.                            
నీతి:సమయస్పూర్తి,ఉపాయంతో కష్టాలని జయించవచ్చు.

సాత్విక(7 సం)
వరుణ్ 
ఈ అమ్మాయి కాకిజంట--పాము కథ చెప్పింది.
కథ: ఒక చెట్టులో కాకిజంట ఉండేది.ఆడ కాకి గుడ్లు పెట్టి ఆహారం కోసం బైటికి వెళ్ళాయి.అప్పుడు ఆ చెట్టు కింద పుట్టలోని పాము ఆ గుడ్లన్ని తినేసింది.కాకిజంట అది చూసి ఎంతోదుక్కించాయి.అవి తమ స్నేహితుడైన నక్కకు తమ కథనంతా చెప్పాయి.అప్పుడు నక్క ఒక ఉపాయం చెప్పింది.ఒకరోజు  రాణి స్నానానికి చెరువుదగ్గరికి వచ్చింది.మగకాకి ఆవిడ నగను తీసుకొని పాము తొర్రలోకి వేసింది.కాకిని పట్టుకోవాలి అని వచ్చిన భటులు అది చూసి పుట్టను తవ్వారు. పాము బైటికి వచ్చి ఇక్కడ ఉండటం క్షేమం కాదు అని పారిపోయింది.భటులు నగను తీసుకోని వెళ్ళిపోయారు.అప్పటినుంచి కాకిజంట హాయిగా ఉన్నాయి.                                      

సాహితి(7 సం)

ఈ అమ్మాయి పట్టుదల కథ చెప్పింది.
కథ:మూడు కప్పలు ఒక పెరుగు కుండలో పడిపోయాయి.మొదటి కప్ప నేను కుండనుండి బైటికి రాగలను అనుకుంది.రెండో కప్ప నేను కుండనుండి బైటికి రావడానికి ప్రయత్నం చేస్తాను అనుకుంది.మూడవది నేను కుండలో నుంచి బైటికి రాలేను అనుకుని ఏ ప్రయత్నం చెయ్యలేదు,అందుకు అది మునిగిపోయింది.మొదటి రెండు కప్పలు మెల్లగా ఈదుతున్నాయి,అప్పుడు వెన్న మెల్లగా పైకి వచ్చింది.అలా వచ్చిన వెన్న మీదకు కప్పలు రెండు ఎక్కి బైటపడ్డాయి.                                       
నీతి:పట్టుదల ఉంటే ఏదన్నా సాదించవచ్చు. 

 వేత(7 సం)

ఈ అమ్మాయి దేవత,గొడ్డలి కథ చెప్పింది.
కథ:ఒక పేద కట్టలు కొట్టె అతను ఉండేవాడు.అతను ఒకరోజు కట్టలు కొట్టేందుకు ఒక నదివొడ్డుకు వెళ్ళి కట్టెలు కొడుతొంటే,అతడి గొడ్డలి నీళ్ళలో పడిపోయింది.అతను ఏడుస్తొంటే ఒక దేవత కనిపించి బంగారు గొడ్డలి చూపించింది.అతను నాది కాదు అన్నాడు.మళ్ళీ వెండి గొడ్డలి చూపించింది,నాది కాదు అన్నాడు.కర్ర గొడ్డలిని చూపించింది,అతను నాదే అన్నాడు.దేవత అతను నిజం చెప్పాడు అని మెచ్చుకొని బంగారం,వెండి గొడ్డళ్ళను కూడా ఇచ్చింది.అతడు అవి అమ్మి ధనవంతుడు అయ్యాడు . అతని స్నేహితుడు అతని కథ విని అతనుకూడా ధనవంతుడు కావాలి అనుకుని నది ఒడ్డుకు వెళ్ళి తన కర్ర గొడ్డలిని నదిలోకి విసిరేసి ఏడవటం మొదలు పెట్టాడు.దేవత కనిపించి అతనికి బంగారు,వెండి గొడ్డళ్ళను చూపించింది.అతనికి ఆశపుట్టి అవి నావే అన్నాడు,అప్పుడు దేవతకు కోపంవచ్చి నువ్వు అబద్ధం  చెప్పావు అని తన కర్ర గొడ్డలిని కూడ ఇవ్వలేదు.                                           
నీతి:అబద్ధం చెప్పకూడదు,ఆశపడకూడదు. 

సౌజన్య(11 సం)

ఈ అమ్మాయి చెల్లని నాణ్యం అనే కథ చెప్పింది.
కథ:ఒక ఊరిలో అవ్వా,మనవడు ఉంటారు.మనవడు చదువుకోకుండా అల్లరిగా తిరుగుతుంటాడు.అవ్వ,మనవడికి బుద్ది చెప్పాలని అలోచిస్తుంది.ఒక రోజు మనవడు నాకు ఆకలిగా ఉంది ఒక రూపాయి ఇవ్వు లడ్డు కొనుక్కుంటాను అని అడిగితే,అవ్వ అతనికి చెల్లని నాణ్యం ఇస్తుంది.అతడు అంగడికి వెళ్ళి ఆ నాణం  ఇచ్చి లడ్డు ఇవ్వమంటాడు.అప్పుడు అంగడి వాడు ఇది చెల్లదు అని నవ్వుతాడు.మనవడు అవ్వ దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా చేసావు అంటె అవ్వ అంటుంది"నువ్వు చదవకుండా అల్లరిచేస్తే అందరూ కూడా నిన్ను చూసి నవ్వుతారు.నువ్వు కూడా ఈ చెల్లని నాణం  లాగే అవుతావు".అప్పుడు మనవడు సిగ్గు తెచ్చుకొని,బుద్దిగా చదువుకుంటాడు.                                            
నీతి:చదువులేని మనిషికి విలువ ఉండదు. 

చివరగా చెప్పాలి అంటే పిల్లలికి కధలు చెప్పడం పూర్తిగా రావడం లేదు 
ఇది వారి పొరపాటు కాదు ... 
ఇంట్లో కధలు చెప్పేవారు లేకపోవడం ... ఉన్నవారు టివి కి పరిమితం అవడం కారణం ... 
కారణాలు ఏవయినా ... విమర్శ ప్రక్కన పెడితే ... ఒక ప్రయత్నం చేసాము ... చిన్న చిన్న లోపాలు ఉన్నా వాటిని మేము పాజిటివ్ గానే ఈ విషయం తీసుకుంటాము ... 

విమర్శిస్తూ కాలం వృధా చేయకుండా ఆచరణ దిశగా అడుగులు వేయడం బృందావనం లక్ష్యం ... 
ఆ దిశ గానే ఎప్పుడు మా ప్రయాణం ఉంటుంది ... 
మరోసారి ఈ కార్యక్రమ నిర్వాహకులకు, బృందావనం సభ్యులకు ధన్యవాదాలు .. 

హచికో...

హచికో...





కొన్ని  రోజుల క్రితం చానెల్స్ మారుస్తూ H.B.O లో ఒక సీన్ చూసాను. ఒక వ్యక్తి ఆఫీసుకో ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అయ్యాడు. కాని అతన్ని వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతోంది అతని పెంపుడు కుక్క. ఆ కుక్క ప్రవర్తన నార్మల్ గా లేదు. సాధారణంగా కుక్కలు ఏదయినా ఆపద గురించి మనల్ని హెచ్చరించాలి అని అనుకుంటే ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాయి. నా ఊహ ఎంతవరకు కర్రెక్ట్ అనేది చెక్ చేసుకుందాం అని ఆ సినిమా చూస్తూ ఉండిపోయాను.అంతే ఇక అక్కడినుంచి కదలాలని అనిపించలేదు.సినిమా మొత్తం చూసాక ఇన్ని రోజులుగా నాకు ఈ సినిమా గురించి తెలియనందుకు చాల బాధగా అనిపించింది.

అసలు జంతువులు ప్రేమించినంత స్వచ్చంగా మనం ఎందుకు ప్రేమించలేము?
కొంచం అభిమానం, కాస్తంత ఆదరణ, అపుడప్పుడు చిరు స్పర్స ...చాలు మనం అంటే ప్రాణం ఇచ్చేస్తాయి
అసలు ఇవి ఏమి లేకపోయినా కూడా మనసార పలకరిస్తే చాలు ఇక చచ్చేదాకా అవి మనల్ని విడిచిపెట్టవు.
మరి మనలో ఆ స్నేహం , ఆ ప్రేమ ఎందుకు ఉండటం లేదు?
ఇన్ని రకాల comunication సాధనాలు ఉన్నాయి కదా అయిన కూడా ఒకరి మనసులో ఎం ఉందో మనం ఎందుకు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాము?

నన్ను అంతగా ఆకట్టుకున్న సినిమా పేరు హాచి...HACHI
ఏంటి కధ ??

అనగనగా ఒక మనిషి
అనగనగా ఒక కుక్క
ఆ మనిషికి ఆ కుక్కకి మధ్య ఉన్న బంధమే HACHI

ఇంతేనా ఆంటే ఇంతే కధ . సినిమా అయిపోగానే గూగుల్ లో వెతికితే నాకు ఆసక్తికరమయిన విషయాలు తెలిసాయి.
ఈ సినిమా కధ కల్పన కాదని నిజంగానే జపాన్ లో జరిగిందని తెలిసింది.

సినిమా ప్రారంభంలో విద్యార్థులు వారి Ideal  Heros గురించి చెప్తూ ఉంటారు.
Ronnie అనే విద్యార్ధి మాత్రం అతని తాతగారు పెంచిన కుక్క గురించి చెప్పడం మొదలుపెడతాడు.
ఆ కుక్కే మన హచికో. 

ఇక కధ విషయానికి వస్తే...ఈ బుజ్జి కుక్క పిల్లని ఒకరు జపాన్ నుంచి అమెరికాకి తీసుకుని వస్తారు.
బాగేజీ కార్ట్ మీద ఉన్న కేజ్ లో ఈ బుజ్జి హాచి ఉంటుంది.
హటాత్తుగా ఆ కేజీ క్రింద పడిపోయి తలుపు తెరుచుకుంటుంది అంతే హాచి పరిగెత్తుకుని వెళ్లిపోతుంటే ఎదురుగా వస్తున్నప్రోఫెసర్  Parker Wilson హాచిని  చూస్తారు.

వారిద్దరూ ఒకరిని ఒకరు చూడగానే వారిమధ్య ఏదో బంధం ఉన్న భావన ప్రొఫెసర్ గారికి కలుగుతుంది. స్టేషన్ లో ఎంతోమంది ఉంటారు మరి ప్రొఫెసర్ కి మాత్రమె ఎందుకు ఆగాలని అనిపించింది?
ఎందుకు ఆ కుక్క పిల్ల ఎవరిదో తెలుసుకుని వారికి అప్పగించాలని అనిపించింది?
ఎందుకు మిగతావారిలా అయన తనకేమి పట్టనట్టు వెళ్లలేకపోయారు ?
బహుశ అదే బంధం ఏమో కదా!!


ప్రొఫెసర్ గారు రైల్వే స్టేషన్లో నే ఆ బుజ్జి కుక్క పిల్లని ఉంచుదాం అని దాన్ని పెంచుకునే వాళ్ళు వచ్చి తీసుకుని వెడతారని అనుకుంటారు.కాని అక్కడ ఉండటానికి రైల్వే అధికారులు ఒప్పుకోరు.దాంతో ప్రొఫెసర్ హాచిని తనతో పాటు ఇంటికి తీసుకుని వెడతారు. అయన భార్య కి కుక్కపిల్లని పెంచడం ఇష్టం ఉండదు. 


మరునాడు కూడా కుక్క పిల్ల కోసం ఎవరు రాకపోవడంతో అది ప్రొఫెసర్ దగ్గరే ఉండిపోతుంది.ఆయన కొలీగ్ హాచి ని చూసి హచి అంటే జపాన్ భాషలో అదృష్టం అని చెప్పడంతో అప్పటినుంచి ప్రొఫెసర్ ఆ బుజ్జి కుక్క పిల్లని హాచి అని పిలవడం మొదలుపెడతారు.ప్రొఫెసర్ కొలీగ్ హచిని , ప్రొఫెసర్ ల మధ్య ఉన్న అనుబంధం  చూసి, వారు  ఇద్దరు ఒకరి కోసం ఒకరు అని చెప్తారు.


అలా హాచి జపాన్ నుంచి స్టేషన్ లో తప్పిపోయి లేదా తప్పించుకుని అనాలేమో ప్రొఫెసర్ గారి దగ్గరికి వచ్చేస్తుంది.
ముందు ప్రొఫెసర్ గారి భార్యకి హాచి తమతో ఉండటం ఇష్టం లేకపోయినా భర్త ఆ కుక్క పిల్లతో పెంచుకున్న అనుబంధం చూసి ఆవిడ కూడా హాచి ని ఫ్యామిలీ మెంబెర్ గా అంగీకరిస్తుంది. 


మాములుగా కుక్కలు బాల్ తో ఆడతాయి.అలాగే మనం ఏదయినా వస్తువు విసిరేస్తే అవి తీసుకొచ్చి ఇవ్వడం , పేపర్ తీసుకుని రమ్మంటే తీసుకుని రావడం వంటివి చేస్తాయి.కాని హాచి మాత్రం ఇవేమీ చేయదు.నార్మల్ డాగ్ లాగ ఉండదు దాని ప్రవర్తన.ఈ విషయం గురించి ప్రొఫెసర్ గారు మళ్ళి తన కొలీగ్ తో మాట్లాడినప్పుడు బహుశా హాచి కనక బాల్ తెచ్చి ఆడుకుందాం అని ఎప్పుడయినా అంటే దానికి తప్పకుండ ఏదో ఒక కారణం ఉంటుంది అని చెప్తారు.


ఇక ప్రతి రోజు ప్రొఫెసర్ కాలేజీ కి వెళ్ళేటప్పుడు హాచి ఆయనతో కలిసి స్టేషన్ కి వెడుతుంది.అయన ట్రైన్ ఎక్కి వెళ్ళాక ఇంటికి తిరిగి వెడుతుంది.మళ్ళి మధ్యాన్నం సరిగ్గా ప్రొఫెసర్ తిరిగి వచ్చే టైం కి స్టేషన్ లో అయన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ప్రొఫెసర్ రాగానే ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. ఇది వారి దినచర్య .


నిజ్జంగా అసలు ఎలాంటి గడియారం లేకుండా హాచి సరిగ్గా ట్రైన్ వచ్చే టైం కి ప్రొఫెసర్ కోసం స్టేషన్ లో ఎదురుచూస్తూ ఉండటం ...ప్రతి రోజు...ఒక్క రోజు కూడా మిస్ అవకుండా ...
ఇలా చేయాలంటే ఒక వ్యక్తి మీద కాని లేదా ఒక బంధం మీద unconditional లవ్ ఉండాలి కదా అనిపిస్తుంది.


ఇలా కొన్ని రోజులు గడుస్తాయి.ఒకరోజు ప్రొఫెసర్ కాలేజీ కి బయలుదేరుతుంటే హాచి అడ్డుపడుతుంది.ఆయనతో స్టేషన్ దాక వెళ్ళడానికి ఇష్టపడదు.ఆయన్ని కూడా వెళ్ళనివ్వదు. ఊరికే మొరుగుతూ ఉంటుంది. ఎప్పుడు బాల్ తో ఆడనిది బాల్ తీసుకుని వచ్చి ఆడుకుందాం అన్నట్టు ప్రొఫెసర్ కి బాల్ ఇస్తుంది.ఇది అంతా చూస్తున్న ప్రొఫెసర్ కి కొంచం ఆశ్చర్యంగా ఉంటుంది. కాని అయన కాలేజి కి వెళ్ళే హడావిడిలో దానితో ఆడుకోవడం కుదరదు. చూస్తున్న మనకి కూడా ఎప్పుడు లేనిది హాచి ఎందుకు అలా ఆయనకి అడ్డుపడుతోంది ? ఎందుకు ఆయన్ని కాలేజికి వెళ్లనివ్వడం లేదు అని సందేహం వస్తుంది.అల వెళ్ళిన ప్రొఫెసర్ ఇక తిరిగి రారు.మ్యూజిక్ క్లాస్ తీసుకుంటున్న అయన హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతారు. అప్పుడు మనకి అర్ధం అవుతుంది హాచి ప్రవర్తన వెనక ఉన్న అసలు కారణం. నిజ్జంగా ఈ సీన్ చూస్తున్నప్పుడు గుండె పట్టినట్టు అయిపోతుంది.


ఇక్కడితో ఇక మనకి ప్రొఫెసర్ గారు కనిపించరు. కాని హాచి మాత్రం పగలు, రాత్రి అన్న తేడ లేకుండా ప్రొఫెసర్ కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. ప్రొఫెసర్ భార్య ఇంటిని అమ్మేసి హాచిని తన కూతిరికి అప్పగిస్తుంది.హాచి ఎక్కడ ఉన్న సరిగ్గా టైంకి వెళ్ళిపోయి ముందు తను ఉన్న పాత ఇంటికి అక్కడినుంచి స్టేషన్ కి వెళ్లి ప్రొఫెసర్ వచ్చే ద్వారం వయిపు చూస్తూ ఎదురుచూస్తూ ఉంటుంది.


ఈ ఎదురుచూపుల గురించి రాయడం కాదు సినిమాలో చూడాలి కళ్ళ వెంట మనకి తెలియకుండానే నీళ్ళు కారిపోతాయి. ఈ విధంగా ఒక రోజు, రెండు రోజులు కాదు దాదాపు తొమ్మిది ఏళ్ళపాటు హాచి విసుగు, విరామం లేకుండా ప్రొఫెసర్ కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది.మంచు పడుతున్న, వర్షం వస్తున్నా అది అక్కడినుంచి కదలదు.దాని అవస్థ చూసి అక్కడి వాళ్ళు ఏదయినా పెడితే తింటుంది తప్ప ఏదయినా తిని వచ్చి మనం మళ్ళి అక్కడ కూర్చుందాం అని అనుకోదు. అసలు దానికి తిండి తినాలి అన్న ధ్యాస కూడా ఉండదు. దాని ద్రుష్టి ఈ మాత్రం అటు ఇటు ప్రక్కకి తిప్పదు. ప్రొఫెసర్ వచ్చే ద్వారం వంకే చూస్తూ ఉంటుంది.


చివరికి హాచి గురించి పేపర్లలో రాస్తారు.అది చూసి ప్రొఫెసర్ భార్య హాచిని చూడటానికి వస్తుంది.ఆవిడతో కూడా అది వెళ్ళదు. అప్పటికే అది ముసలిది అయిపోతుంది...ఒక రోజు రాత్రి అలా స్టేషన్ లో ప్రొఫెసర్ వచ్చే ద్వారం వంక చూస్తూ అది కళ్ళు మూసేస్తుంది. 


సినిమా అయిపోతుంది కాని హాచి మాత్రం మనకి గుర్తుండిపోతుంది.ఆ సినిమా చూసినప్పటినుంచి నాకు ఏ కుక్కని చూసినా హాచినే అనిపిస్తోంది. 

ఇది నిజంగా జరిగిన కధ...
1924 లో ప్రొఫెసర్ ueno హాచికో ని టోక్యోకి తీసుకుని వచ్చారు. హచికో shibuya train station లో  ప్రొఫెసర్ ని ట్రైన్ ఎక్కించేది.మళ్ళి అయన తిరిగి వచ్చే టైం కి వెళ్లి రిసీవ్ చేసుకునేది. ప్రొఫెసర్ గారు 1925 లో చనిపోయిన అది మాత్రం స్టేషన్ దగ్గర ఎదురుచూడటం మానలేదు. ఈ విధంగా పది ఏళ్ళు అలా ఎదురుచూసి అక్కడే ఆ స్టేషన్ దగ్గరే ప్రాణం విడిచింది హచికో.

హచికో ఎక్కడ అయితే తన మాస్టర్ కోసం ఎదురుచూసిందో అక్కడ హచికో STATUE నెలకొల్పారు.ఈ రోజుకి హాచిని అభిమానించేవారు, హాచి గురించి తెలుసుకున్నవారు టోక్యో వెడితే తప్పకుండా హాచి విగ్రహాన్ని చూసి వస్తారు.


Hachiko represents love , innocence, fear, hope, joy, loss and loneliness and symbol of loyalty”

ఒక మంచి సినిమా BENJI THE HUNTED



కొన్ని సినిమాలు మనల్ని ఎంత వెంటాడుతాయంటే అసలు వాటిని మర్చిపోవడం కష్టం అనిపిస్తుంది. 
అలాంటి సినిమా ఇది 
అసలు ఇంత చిన్న పాయింట్ మీద సినిమా తీయడం సాధ్యమా? ...మళ్ళీ అందులోను బోలెడంత సస్పెన్సు తో ... 

ఇక కధలోకి వెడితే 
అనగనగా ఒక బెంజి, ఒక బుల్లి కుక్క పిల్ల అన్నమాట ...
అది, దాని జుట్టు భలే ముద్దుగా ఉంటుంది.  
ఈ బుజ్జి కుక్కపిల్ల అడవిలో తప్పిపోతుంది . దాన్ని వాళ్ళ మాస్టర్ వెతుకుతూ ఉంటాడు 
ఇలా తప్పిపోయిన బెంజి ఒక చోట ఒక సింహాన్ని ఒక వేటగాడు కాల్చేయడం చూస్తుంది . 
పాపం ఆ సింహం తల్లికి నాలుగు బుల్లి బుల్లి పిల్లలు ఉంటాయి . 
తన కళ్ళ ముందు ఆ నాలుగు బుల్లి సింహం పిల్లలు అలా అనాధలు అయిపోవడం బెంజి కి బాధగా అనిపిస్తుంది . 
వాటిని అలా వదిలి వెళ్ళబుద్ధి కాదు . 

ఒకవైపు ఈ పిల్లల బాధ్యత , మరివైపు వాటికి మరో పెంపుడు తల్లిని వెతకాలి వీటికి తోడు వేటగాడు నుంచి తప్పించుకోవాలి... తన కోసం వెతుకుతున్న మాస్టర్ దగ్గరికి వెళ్లిపోవాలి 

ఒక్కసారి ఎన్ని కష్టాలో చూసారా 
వీటికి తోడు  ఇంకో కష్టం ఉంది 
ఈ సింహం పిల్లలు అటు ఇటు వెడుతూ అల్లరి చేస్తూ ఉంటాయి వాటిని హెచ్చరిస్తూ , జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి . ఒక సింహానికి తన పిల్లల్ని పెంచుకోవడం వస్తుంది కాని కుక్కకి ఎలా వస్తుంది ? కాని బెంజి చాలా తాపత్రయపడుతుంది. 

మొత్తం మీద ఇంకో సింహం తల్లి కనిపిస్తుంది 
ఆ సింహానికి ఈ నాలుగు పిల్లల్ని అప్పచెప్పాలని బెంజి ప్రయత్నం ప్రారంభిస్తుంది . 
ఈ పని బెంజి ఎంత శ్రద్ధగా చేస్తుంది అంటే .. 

బాధ్యత ఎలా ఉంటుంది అని మీకు సందేహం వస్తే ఈ సినిమా చూస్తే చాలు అని నాకు అనిపిస్తూ ఉంటుంది 

మధ్య మధ్య లో ఒక గ్రద్ద , ఎలుగుబంటి వంటివి పిల్లల్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండటం...  వాటినుంచి పిల్లల్ని కాపాడుకోవడం , పెంపుడు తల్లి సింహం తన పిల్లలికి ఏవి ఎలా నేర్పిస్తోందో చూసి అవి నాలుగు పిల్లలికి నేర్పడం ... 

ఇవి అన్ని ఒక ఎత్తు అయితే  పిల్లల్ని ఒక్కోదానిని నోటితో పట్టుకుని  ఒక పెద్ద కొండ ఇటు నుంచి అటు ఎక్కడానికి బెంజి పడే అవస్థలు చూస్తుంటే పిల్లలు పడిపోతాయేమో లేదా బెంజి కొండ ఎక్కలేక జారిపోతుందేమో అని భయం వేస్తుంది . రెప్ప వేయకుండా చూస్తాం మనం 

ఈ జర్నీ లో ఒకసారి తన మాస్టర్ని చూస్తుంది . ఒక్క నిమిషం దానికి మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది విశ్వాసం దాన్ని అలా ప్రేరేపిస్తుంది . అంతలోనే తల్లిని కోల్పోయిన సింహం పిల్లలు...  ఎటు వెళ్ళాలో అర్ధం కాని సదిగ్ధం లో చివరికి బెంజి తన బాధ్యత వైపు మొగ్గు చూపుతుంది. ఇక్కడ కూడా డైరెక్టర్ ఎంత బాగా తీసారో !!

మొత్తానికి పెంపుడు సింహానికి బెంజి కష్టం అర్ధం అవుతుంది 
ఆ నాలుగు పిల్లల్ని అక్కున చేర్చుకుంటుంది 
బెంజి తన మాస్టర్ కోసం వెళ్ళిపోతుంది 
ఇంతే సినిమా 

ఒకే ఒక్క డైలాగ్ సినిమా మొత్తం మాస్టర్ పిలిచే " బెంజి " అన్న పిలుపు అంతే 
కాని ఎన్ని ఎమోషన్స్, ఫీలింగ్స్... 
కళ్ళు మనకి తెలీకుండానే చెమ్మగిల్లుతాయి 
విశ్వ భాష అంటే ఇదే కదా 
విశ్వ భాష కి మాటలు అక్కర్లేదు మనసు ముఖ్యం ... విశ్వ భాష అంటే మనసు భాష అంతే ... 
వీలయితే ఒక్కసారి ఈ సినిమా చూడండి ..

మంచి సినిమా "Two brothers"


నా స్నేహితుడు ఉదయ్ చెప్పగా 2004 సంవత్సరం లో విడుదలైన Two brothers అనే పులుల కు సంబంధించిన సినిమా చూశాను. చాలా బాగుంది. ప్రేమాభిమానాలు, మాతృప్రేమ అనేవి సర్వవ్యాపకమని పులుల ద్వారా దర్శకుడు బాగా చెప్పగలిగాడు.

తల్లి పులి, దాని ఇద్దరు బిడ్డలైన రెండు పిల్లలు మానవ స్వార్థం వలన విడిపోవడం తర్వాత ఎన్నో కష్టాలు పడడం చివరికి మూడూ కలవడం ఎంతో బాగా చూపించారు. ముఖ్యంగా పులులు మధ్య భావోద్వేగాలను దర్శకుడు చాలా బాగా చూపించాడు. కొన్ని దృశ్యాలలో మనము కూడా ఆ భావోద్వేగంలో లీనమైపోతాము. అంతబాగా తీశారు.
సెంటిమెంట్ కు పెద్దపీట వేస్తూ తీశిన ఈ ఆంగ్ల చిత్రం చాలా కదిలించింది.

మన తెలుగు మూసచిత్రాలకు భిన్నంగా మంచి సినిమా చూడాలనే కోరిక ఈ సినిమా ద్వారా తీరింది.

ఈ చిత్రం ఫ్రెంచ్ నుండి ఆంగ్లానికి అనువదించినట్లు ఉంది.