Thursday, February 19, 2015

హచికో...

హచికో...





కొన్ని  రోజుల క్రితం చానెల్స్ మారుస్తూ H.B.O లో ఒక సీన్ చూసాను. ఒక వ్యక్తి ఆఫీసుకో ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అయ్యాడు. కాని అతన్ని వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతోంది అతని పెంపుడు కుక్క. ఆ కుక్క ప్రవర్తన నార్మల్ గా లేదు. సాధారణంగా కుక్కలు ఏదయినా ఆపద గురించి మనల్ని హెచ్చరించాలి అని అనుకుంటే ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాయి. నా ఊహ ఎంతవరకు కర్రెక్ట్ అనేది చెక్ చేసుకుందాం అని ఆ సినిమా చూస్తూ ఉండిపోయాను.అంతే ఇక అక్కడినుంచి కదలాలని అనిపించలేదు.సినిమా మొత్తం చూసాక ఇన్ని రోజులుగా నాకు ఈ సినిమా గురించి తెలియనందుకు చాల బాధగా అనిపించింది.

అసలు జంతువులు ప్రేమించినంత స్వచ్చంగా మనం ఎందుకు ప్రేమించలేము?
కొంచం అభిమానం, కాస్తంత ఆదరణ, అపుడప్పుడు చిరు స్పర్స ...చాలు మనం అంటే ప్రాణం ఇచ్చేస్తాయి
అసలు ఇవి ఏమి లేకపోయినా కూడా మనసార పలకరిస్తే చాలు ఇక చచ్చేదాకా అవి మనల్ని విడిచిపెట్టవు.
మరి మనలో ఆ స్నేహం , ఆ ప్రేమ ఎందుకు ఉండటం లేదు?
ఇన్ని రకాల comunication సాధనాలు ఉన్నాయి కదా అయిన కూడా ఒకరి మనసులో ఎం ఉందో మనం ఎందుకు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాము?

నన్ను అంతగా ఆకట్టుకున్న సినిమా పేరు హాచి...HACHI
ఏంటి కధ ??

అనగనగా ఒక మనిషి
అనగనగా ఒక కుక్క
ఆ మనిషికి ఆ కుక్కకి మధ్య ఉన్న బంధమే HACHI

ఇంతేనా ఆంటే ఇంతే కధ . సినిమా అయిపోగానే గూగుల్ లో వెతికితే నాకు ఆసక్తికరమయిన విషయాలు తెలిసాయి.
ఈ సినిమా కధ కల్పన కాదని నిజంగానే జపాన్ లో జరిగిందని తెలిసింది.

సినిమా ప్రారంభంలో విద్యార్థులు వారి Ideal  Heros గురించి చెప్తూ ఉంటారు.
Ronnie అనే విద్యార్ధి మాత్రం అతని తాతగారు పెంచిన కుక్క గురించి చెప్పడం మొదలుపెడతాడు.
ఆ కుక్కే మన హచికో. 

ఇక కధ విషయానికి వస్తే...ఈ బుజ్జి కుక్క పిల్లని ఒకరు జపాన్ నుంచి అమెరికాకి తీసుకుని వస్తారు.
బాగేజీ కార్ట్ మీద ఉన్న కేజ్ లో ఈ బుజ్జి హాచి ఉంటుంది.
హటాత్తుగా ఆ కేజీ క్రింద పడిపోయి తలుపు తెరుచుకుంటుంది అంతే హాచి పరిగెత్తుకుని వెళ్లిపోతుంటే ఎదురుగా వస్తున్నప్రోఫెసర్  Parker Wilson హాచిని  చూస్తారు.

వారిద్దరూ ఒకరిని ఒకరు చూడగానే వారిమధ్య ఏదో బంధం ఉన్న భావన ప్రొఫెసర్ గారికి కలుగుతుంది. స్టేషన్ లో ఎంతోమంది ఉంటారు మరి ప్రొఫెసర్ కి మాత్రమె ఎందుకు ఆగాలని అనిపించింది?
ఎందుకు ఆ కుక్క పిల్ల ఎవరిదో తెలుసుకుని వారికి అప్పగించాలని అనిపించింది?
ఎందుకు మిగతావారిలా అయన తనకేమి పట్టనట్టు వెళ్లలేకపోయారు ?
బహుశ అదే బంధం ఏమో కదా!!


ప్రొఫెసర్ గారు రైల్వే స్టేషన్లో నే ఆ బుజ్జి కుక్క పిల్లని ఉంచుదాం అని దాన్ని పెంచుకునే వాళ్ళు వచ్చి తీసుకుని వెడతారని అనుకుంటారు.కాని అక్కడ ఉండటానికి రైల్వే అధికారులు ఒప్పుకోరు.దాంతో ప్రొఫెసర్ హాచిని తనతో పాటు ఇంటికి తీసుకుని వెడతారు. అయన భార్య కి కుక్కపిల్లని పెంచడం ఇష్టం ఉండదు. 


మరునాడు కూడా కుక్క పిల్ల కోసం ఎవరు రాకపోవడంతో అది ప్రొఫెసర్ దగ్గరే ఉండిపోతుంది.ఆయన కొలీగ్ హాచి ని చూసి హచి అంటే జపాన్ భాషలో అదృష్టం అని చెప్పడంతో అప్పటినుంచి ప్రొఫెసర్ ఆ బుజ్జి కుక్క పిల్లని హాచి అని పిలవడం మొదలుపెడతారు.ప్రొఫెసర్ కొలీగ్ హచిని , ప్రొఫెసర్ ల మధ్య ఉన్న అనుబంధం  చూసి, వారు  ఇద్దరు ఒకరి కోసం ఒకరు అని చెప్తారు.


అలా హాచి జపాన్ నుంచి స్టేషన్ లో తప్పిపోయి లేదా తప్పించుకుని అనాలేమో ప్రొఫెసర్ గారి దగ్గరికి వచ్చేస్తుంది.
ముందు ప్రొఫెసర్ గారి భార్యకి హాచి తమతో ఉండటం ఇష్టం లేకపోయినా భర్త ఆ కుక్క పిల్లతో పెంచుకున్న అనుబంధం చూసి ఆవిడ కూడా హాచి ని ఫ్యామిలీ మెంబెర్ గా అంగీకరిస్తుంది. 


మాములుగా కుక్కలు బాల్ తో ఆడతాయి.అలాగే మనం ఏదయినా వస్తువు విసిరేస్తే అవి తీసుకొచ్చి ఇవ్వడం , పేపర్ తీసుకుని రమ్మంటే తీసుకుని రావడం వంటివి చేస్తాయి.కాని హాచి మాత్రం ఇవేమీ చేయదు.నార్మల్ డాగ్ లాగ ఉండదు దాని ప్రవర్తన.ఈ విషయం గురించి ప్రొఫెసర్ గారు మళ్ళి తన కొలీగ్ తో మాట్లాడినప్పుడు బహుశా హాచి కనక బాల్ తెచ్చి ఆడుకుందాం అని ఎప్పుడయినా అంటే దానికి తప్పకుండ ఏదో ఒక కారణం ఉంటుంది అని చెప్తారు.


ఇక ప్రతి రోజు ప్రొఫెసర్ కాలేజీ కి వెళ్ళేటప్పుడు హాచి ఆయనతో కలిసి స్టేషన్ కి వెడుతుంది.అయన ట్రైన్ ఎక్కి వెళ్ళాక ఇంటికి తిరిగి వెడుతుంది.మళ్ళి మధ్యాన్నం సరిగ్గా ప్రొఫెసర్ తిరిగి వచ్చే టైం కి స్టేషన్ లో అయన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ప్రొఫెసర్ రాగానే ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. ఇది వారి దినచర్య .


నిజ్జంగా అసలు ఎలాంటి గడియారం లేకుండా హాచి సరిగ్గా ట్రైన్ వచ్చే టైం కి ప్రొఫెసర్ కోసం స్టేషన్ లో ఎదురుచూస్తూ ఉండటం ...ప్రతి రోజు...ఒక్క రోజు కూడా మిస్ అవకుండా ...
ఇలా చేయాలంటే ఒక వ్యక్తి మీద కాని లేదా ఒక బంధం మీద unconditional లవ్ ఉండాలి కదా అనిపిస్తుంది.


ఇలా కొన్ని రోజులు గడుస్తాయి.ఒకరోజు ప్రొఫెసర్ కాలేజీ కి బయలుదేరుతుంటే హాచి అడ్డుపడుతుంది.ఆయనతో స్టేషన్ దాక వెళ్ళడానికి ఇష్టపడదు.ఆయన్ని కూడా వెళ్ళనివ్వదు. ఊరికే మొరుగుతూ ఉంటుంది. ఎప్పుడు బాల్ తో ఆడనిది బాల్ తీసుకుని వచ్చి ఆడుకుందాం అన్నట్టు ప్రొఫెసర్ కి బాల్ ఇస్తుంది.ఇది అంతా చూస్తున్న ప్రొఫెసర్ కి కొంచం ఆశ్చర్యంగా ఉంటుంది. కాని అయన కాలేజి కి వెళ్ళే హడావిడిలో దానితో ఆడుకోవడం కుదరదు. చూస్తున్న మనకి కూడా ఎప్పుడు లేనిది హాచి ఎందుకు అలా ఆయనకి అడ్డుపడుతోంది ? ఎందుకు ఆయన్ని కాలేజికి వెళ్లనివ్వడం లేదు అని సందేహం వస్తుంది.అల వెళ్ళిన ప్రొఫెసర్ ఇక తిరిగి రారు.మ్యూజిక్ క్లాస్ తీసుకుంటున్న అయన హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతారు. అప్పుడు మనకి అర్ధం అవుతుంది హాచి ప్రవర్తన వెనక ఉన్న అసలు కారణం. నిజ్జంగా ఈ సీన్ చూస్తున్నప్పుడు గుండె పట్టినట్టు అయిపోతుంది.


ఇక్కడితో ఇక మనకి ప్రొఫెసర్ గారు కనిపించరు. కాని హాచి మాత్రం పగలు, రాత్రి అన్న తేడ లేకుండా ప్రొఫెసర్ కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. ప్రొఫెసర్ భార్య ఇంటిని అమ్మేసి హాచిని తన కూతిరికి అప్పగిస్తుంది.హాచి ఎక్కడ ఉన్న సరిగ్గా టైంకి వెళ్ళిపోయి ముందు తను ఉన్న పాత ఇంటికి అక్కడినుంచి స్టేషన్ కి వెళ్లి ప్రొఫెసర్ వచ్చే ద్వారం వయిపు చూస్తూ ఎదురుచూస్తూ ఉంటుంది.


ఈ ఎదురుచూపుల గురించి రాయడం కాదు సినిమాలో చూడాలి కళ్ళ వెంట మనకి తెలియకుండానే నీళ్ళు కారిపోతాయి. ఈ విధంగా ఒక రోజు, రెండు రోజులు కాదు దాదాపు తొమ్మిది ఏళ్ళపాటు హాచి విసుగు, విరామం లేకుండా ప్రొఫెసర్ కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది.మంచు పడుతున్న, వర్షం వస్తున్నా అది అక్కడినుంచి కదలదు.దాని అవస్థ చూసి అక్కడి వాళ్ళు ఏదయినా పెడితే తింటుంది తప్ప ఏదయినా తిని వచ్చి మనం మళ్ళి అక్కడ కూర్చుందాం అని అనుకోదు. అసలు దానికి తిండి తినాలి అన్న ధ్యాస కూడా ఉండదు. దాని ద్రుష్టి ఈ మాత్రం అటు ఇటు ప్రక్కకి తిప్పదు. ప్రొఫెసర్ వచ్చే ద్వారం వంకే చూస్తూ ఉంటుంది.


చివరికి హాచి గురించి పేపర్లలో రాస్తారు.అది చూసి ప్రొఫెసర్ భార్య హాచిని చూడటానికి వస్తుంది.ఆవిడతో కూడా అది వెళ్ళదు. అప్పటికే అది ముసలిది అయిపోతుంది...ఒక రోజు రాత్రి అలా స్టేషన్ లో ప్రొఫెసర్ వచ్చే ద్వారం వంక చూస్తూ అది కళ్ళు మూసేస్తుంది. 


సినిమా అయిపోతుంది కాని హాచి మాత్రం మనకి గుర్తుండిపోతుంది.ఆ సినిమా చూసినప్పటినుంచి నాకు ఏ కుక్కని చూసినా హాచినే అనిపిస్తోంది. 

ఇది నిజంగా జరిగిన కధ...
1924 లో ప్రొఫెసర్ ueno హాచికో ని టోక్యోకి తీసుకుని వచ్చారు. హచికో shibuya train station లో  ప్రొఫెసర్ ని ట్రైన్ ఎక్కించేది.మళ్ళి అయన తిరిగి వచ్చే టైం కి వెళ్లి రిసీవ్ చేసుకునేది. ప్రొఫెసర్ గారు 1925 లో చనిపోయిన అది మాత్రం స్టేషన్ దగ్గర ఎదురుచూడటం మానలేదు. ఈ విధంగా పది ఏళ్ళు అలా ఎదురుచూసి అక్కడే ఆ స్టేషన్ దగ్గరే ప్రాణం విడిచింది హచికో.

హచికో ఎక్కడ అయితే తన మాస్టర్ కోసం ఎదురుచూసిందో అక్కడ హచికో STATUE నెలకొల్పారు.ఈ రోజుకి హాచిని అభిమానించేవారు, హాచి గురించి తెలుసుకున్నవారు టోక్యో వెడితే తప్పకుండా హాచి విగ్రహాన్ని చూసి వస్తారు.


Hachiko represents love , innocence, fear, hope, joy, loss and loneliness and symbol of loyalty”

No comments:

Post a Comment