పిల్లల సినిమా...పసంగ
July 6, 2014
తమిళంలో `పసంగ' అంటే పిల్లలు అని అర్థం. ఈ
సినిమా అంతా పిల్లలే. ఇద్దరు చిన్నపిల్లలు వారి కుటుంబాలు. కానీ ఇది
పిల్లలకోసం పెద్దలు తీసిన సినిమాకాదు. పెద్దలు తీసిన పిల్లల సినిమా అంతకంటే
కాదు. పిల్లలకు మంచిని బోధించే సందేశాత్మక సినిమా అసలే కాదు. పిల్లాటల
సినిమా అస్సలు కాదు. ఇదొక సినిమా. ఒక నిజమైన పిల్లల సినిమా. అంతే...
2009లో వచ్చిన తమిళ సినిమా కథ విషయానికి వస్తే... ఐదో తరగతి నుంచి ఆరో తరగతికి వెళ్ళిన కొందరు పిల్లల కథ. అన్బు (కిషోర్), జీవ (శ్రీరాం) అనే ఇద్దరు విద్యార్థుల కథ. వాళ్ళ కుటుంబాల ప్రేమలు, గొడవల కథ. పిల్లల్లోని పిడుగులూ, అల్లరిమూకలూ, బుద్దిమంతులు, క్లాస్ లీడర్ రాజకీయాలు, అన్నీ కలిపిన అద్వితీయమైన కథ. ఒక చిన్న ఊర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఏమేమి జరుగుతుంటాయో వాటన్నింటినీ తెరకెక్కించిన అద్భుతం చిత్రం.
ఊహల్లో స్కూటరెక్కినట్లు ఊహించుకుని బూమ్ అని సౌండ్ చేసుకుంటూ వెళ్ళే పిల్లలు. పదిపైసల బిళ్ళని కాగితం క్రిందపెట్టి పెన్సిల్‌తో అచ్చుగీసే పిల్లలు. క్లాసులో ఎవరైనా అపానవాయువు వదిల్తే `అగ్గిపెట్టె, గిగ్గిపెట్టె' అంటూ ఎవరు బాంబేసారో ఇట్టే కనిపెట్టేసే పిల్లలు. నాలుక మీద మచ్చున్నోళ్ళు ఏం చెబితే అది జరుగుతుందనుకునే పిల్లలు. నెమలి ఈకని పుస్తకంలో పెట్టి పిల్లలు పెడుతుందని నమ్మే పిల్లలు. అబ్రకం ముక్కల్ని నెమలి ఈక తింటుందని నమ్మే పిల్లలు. గట్టిగా చదువుతూ పక్కోళ్ళని చదవకుండా చేసే పిల్లలు. క్లాస్ లీడర్ బోర్డు మీద అల్లరిచేసినవాళ్ళ పేర్లు రాస్తే గొడవపడే పిల్లలు. క్లాసులో నిద్రపోయే పిల్లాడికి మొటిక్కాయలు వేసే పిల్లలు. మార్కులు తక్కువొస్తే ముక్కూచెంపలు వాయించే పిల్లలు. ఇంకా ఇంకా ఎన్నెన్నో చేసే చిన్నారి పాఠశాల పిల్లల అల్లరే ఈ సినిమా నేపథ్యం.
తండ్రి ఆర్థిక పరిస్థితి బాగోక ఇంగ్లీషు మీడియంలో చదివే అన్బు ప్రభుత్వం పాఠశాలలో ఆరవతరగతిలో చేరుతాడు. అప్పటివరకూ ఒకటి నుండీ ఐదు వరకూ ఎదురులేకుండా ఉన్న జీవాకు కంటగింపుగా మారతాడు. జీవా తండ్రి ఈ ఇద్దరూ ఉన్న క్లాస్‌కి క్లాస్ టీచర్. అన్బు చదువులో సంస్కారంలో అందరికన్నా ముందుంటూ మన్ననలు చూరగొంటాడు. క్లాస్ లీడర్ అవుతాడు. జీవా ఈర్ష్య కోపంగా మారుతుంది. ఎప్పటికప్పుడు అన్బుని తక్కువచేసి చూపాలనే ప్రయత్నాలు చేస్తాడు. చివరకు అదే క్లాసులో చదువుతున్న జీవా అత్తకూతురు కూడా అన్బుతో స్నేహంగా మెలగడం మొదలవుతుంది. జీవా కోపం కసిగా మారుతుంది. ఎప్పటికప్పుడు అన్బు జీవాతో స్నేహం చెయ్యాలని చూసినా జీవా పెంకితనం వారి స్నేహానికి అడ్డుగా మారుతుంది. దానికి తోడు జీవా పక్కనున్న ఒక మిత్రద్వయం ఎప్పటికప్పుడు జీవాను ఎగదోస్తూ పరిస్థితిని ఇలాగే కొనసాగేలా చూస్తుంటారు.
అన్బు-జీవాల గొడవలు చివరకు వాళ్ళ కుటుంబాల వరకూ పాకుతాయి. అప్పటికే ఆర్థిక పరిస్థితి బాగోలేని అన్బు కుటుంబం మరింత కల్లోలానికి గురవుతుంది. ఈ గొడవల మధ్యలో జీవా అక్క సోబికన్ను (వేగ), అన్బు బాబాయ్ సుందరం (విమల్) ప్రేమించుకుంటారు. ఈ పిల్లల వైరాలు సమసిపోతాయా, కుటుంబాలు కలుస్తాయా, సోబికన్ను - సుందరంల ప్రేమ సఫలం అవుతుందా అనేది చిత్రకథ.
తమిళ నిర్మాత శశికుమార్ నిర్మించిన ఈ చిత్రానికి పాండియరాజన్ అనే దర్శకుడు దర్శకత్వం వహించాడు. పాండియరాజన్‌కు ఇదే తొలి చిత్రం అయినా... పిల్లల మనోభావాల్ని ఎంతో అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. ఈ సినిమా చిన్నపిల్లలందరికీ ఎంతో నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

No comments:
Post a Comment