మీరెప్పుడయినా మీ జీవితంలో ఇది ఎలాగయినా సాధించాలి అని అనుకున్నారా ? అది మీకు అసాధ్యమయినదే అయినా కూడా ?
అలా కుంగ్ ఫూ లో ప్రావీణ్యం సాధించాలనుకున్న ఒక పాండా కథే ఈ సినిమా.
కుంగ్ ఫూ ఎలాగయినా నేర్చుకోవాలన్నది “పో” అనే పాండా ఆశయం. కానీ పరిస్థితుల వల్ల దానికది కుదరదు. ఒకసారి అనుకోకుండా “టాయ్ లుంగ్” అనే స్నో లెపర్డుతో పోరాడడానికి టైగ్రెస్, క్రేన్, మాంటిస్, వైపర్, మంకీ అనే “ఫ్యూరియస్ ఫైవ్” కాకుండా పాండా ఎన్నికవుతుంది. ఆఖరికి గురువు “షిఫు” కి కూడా “పో” అంటే ఇష్టం ఉండదు.
కానీ పో ఎలా తన మీద నమ్మకంతో “టాయ్ లుంగ్” ని ఓడించిందో అనేదే కథ.
మనిషి జీవితంలో కూడా ఎన్నో సాధించాలనుకుంటాడు. కానీ ఎన్నో అవరోధాలు, అనుమానాలు. అన్నీ అధిగమించి తన మీద నమ్మకం పెంచుకోగలిగితేనే అనుకున్నది సాహించగలుగుతాడు. అలాంటి సూత్రాన్ని హాస్యభరితమయిన యానిమేషను చిత్రంలో బంధించి మనకు వివరించడంలో సఫలమయింది ఈ సినిమా.
సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: Kung Fu Panda
సినిమాల ద్వారా చదువులు చెప్పచ్చని అనగానే అదేదో సీరియస్
సినిమాలతోనే సాధ్యం అని అనుకోకూడదు. సరదాగా సాగిపోయి, బోలెడంత
ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాల్లో సయితం ఎన్నో పాఠాలు వుంటాయి. ఎటొచ్చీ అవి
తెలుసుకోడానికే కొంత ప్రయత్నం చెయ్యాలి. అలా సరదాగా సాగే పిల్లల సినిమా
“కుంగ్ ఫూ పాండా” చిత్రంలో వున్న మేనేజ్మెంట్ పాఠాలను తెలుసుకునే ప్రయత్నమే
ఈ వారం వ్యాసం.
కుంగ్ ఫూ పాండా కథ చాలా మందికి తెలిసే వుంటుంది. Underdog తరహాలో సాగే ఈ కథలో పో (Po)
అనే ఒక పాండా ఎప్పటికైనా కుంగ్ ఫూ యుద్ధం చెయ్యాలని కలలు కంటుంటుంది. అలా
కలలు ఫలించి, ఒకరోజు అనుకోని విధంగా తాను ఎంతగానో ఆరాధించే Furious Five తో పోటీ పడి Dragon Warrior గా ఎన్నుకొబడుతాడు. అలా ఎన్నుకోబడ్డ ’పో’ అత్యంత భయంకరమైన టై లాంగ్ తో యుద్ధం చేసి నిజమైన వారియర్ గా నిలవడమే ఈ చిత్రం.ఒకవిధంగా చూస్తే అయాచితంగా Dragaon Warrior గా మారిన పాండా ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడమే సినిమా కథ అని చెప్పవచ్చు. సరిగ్గా ఇలాగే చాలా సందర్భాలలో కొత్తగా ఉద్యోగంలొ చేరినవారికి ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడమే పరిక్షగా నిలుస్తుంది. అలాంటి వారికి ఉపయోగపడే పాఠాలు ఈ చిత్రమంతా వున్నాయి. అందుకే చాలా Induction Trainings లో ఈ సినిమాని ప్రదర్శిస్తారు. (నేను కూడా ఈ మధ్య ఒక కాలేజీలో కొత్తగా చేరిన ఎం.బీ.యే. విద్యార్థులకు ఇదే సినిమా చూపించి అందులో పాఠాలను వారి కోర్సుకు అన్వయించి చెప్పాను.)
కుంగ్ ఫూ పాండాలో మేనేజ్మెంట్ పాఠాలు:
Desire and Belief
వీటి గురించి వివరించాల్సిన అవసరం లేకపోయినా వీటి గురించి ముందు చెప్పుకొవాల్సిన అవసరం వుంది. పాండాకి కుంగ్ ఫూ చెయ్యాలన్న బలమైన కోరిక వున్నా అది చెయ్యగలనన్న నమ్మకం లేకపోవటం వల్లే తండ్రి మాట వినే మామూలు “big fat panda” గా మిగిలిపోతాడు. ఆఖరుకు గుగ్గురువు ఊగ్వే (Tortoise Oogway) పాండాని డ్రాగెన్ వారియర్ గా నియమించినా ఆ విషయాన్ని నమ్మలేకపోతాడు. కానీ తండ్రి Secret Ingredients గురించి చెప్పిన తరువాత కలిగిన నమ్మకంతోనే Tai Lung మీద విజయం సాధిస్తాడు. అందుకే కోరిక దానికి అణుగుణంగా నమ్మకం విజయానికి మూల హేతువులు అవుతాయి.
Challenge the Challenges with Smile
గుగ్గురువు (Tortoise) ఊగ్వే పాండాని డ్రాగన్ వారియర్ గా ప్రకటించిన తరువాత ఎవ్వరూ ఆ విషయాన్ని నమ్మరు. ఆఖరకు పాండా కూడా ఆ విషయాన్ని నమ్మకపోవటం మనందరికీ తెలుసు. అయినా ఊగ్వే మీద నమ్మకం/గౌరవం వల్ల అయితేనేమీ, కుంగ్ ఫూ/Furious Five వల్ల అయితేనేమీ అక్కడే వుండిపోతాడు. అలా వుండిపోయిన పాండాని వెళ్ళగొట్టేందుకు, అతని చేతగానితనాన్ని నిరూపించేందుకూ షిఫూ, Furious Five అయిదుగ్గురు సభ్యులు ఎన్ని రకాలుగా పరీక్షలు పెట్టినా, అవమానించినా నవ్వుతూ నిలబడటం వల్లే పాండా చివరికి విజయాన్ని సాధిస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే Hard Workతో కలిసిన Perseverance కి అపజయం వుండదు. ఇదే సందర్భంలో పాండాకి ఇష్టమైన తిండిని వాడుతూ ట్రైనింగ్ ఇవ్వడం Positive Reinforcement కి మంచి వుదాహరణ.
There is No Secret Ingredient
మొత్తం మీద నాకు బాగా నచ్చిన పాఠం ఇది. డ్రాగన్ వారియర్ కి ఏదో శక్తివంతమైన సహాయం Dragon Scroll ద్వారా లభిస్తుందని నమ్ముతుంది పాండా. తీరా అది చేతికి చిక్కాక అందులో ఏమీ లేదని నిరాశ పొందుతుంది. అదే విధంగా పాండా తండ్రి (Goose) Mr. Ping తయారు చేసే Secret Ingredient Soup విషయంలోనూ ఇలాంటి రహస్యం ఒకటి వుంటుంది. ఆ గుట్టు విప్పినప్పుడు Mr. Ping చెప్పే మాటలు అమూల్యమైనవి. “The secret ingredient of the secret ingredient soup is NOTHING. You just got to believe that it is special.” అంతే ఆ ఒక్క వాక్యం పాండా దృక్పధాన్ని మార్చేస్తుంది. Dragon Scroll ఏమీ లేకపోయినా తన ముఖం తనకే కనిపించిందన్న వాస్తవం తెలుసుకోని, శక్తివంతమైన సహాయం తనకి తనే అని తెలుసుకోని ధైర్యంగా Tai Lung తో పోరాటానికి సిద్ధపడతాడు. అదే అతని విజయానికి కారణం కూడా అవుతుంది.
ఈ విధంగా అనుకొకుండా పదవులలోకి వచ్చినవారు, కష్టమైన పని మొదలుపెడుతున్నవాళ్ళు నేర్చుకోని తీరాల్సిన పాఠాలను నేర్పిస్తుంది కుంగ్ ఫూ పాండా.
No comments:
Post a Comment