నెమో అన్న చేపపిల్ల తప్పిపోయి ఎక్కడెక్కడికో చేరుతుంది. దానిని కాపాడడానికి అతని తండ్రి మార్లిన్ ఎలా ప్రయత్నిస్తాడో అన్నదే కథ.
ఒక యానిమేషను అద్భుతంగా ఈ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. కొన్ని వందలు, వేలాది సముద్ర ప్రాణులను చూపించాలి ఈ సినిమా కోసం. తాబేళ్ళు, జెల్లీ ఫిష్‌లు, షార్క్‌లు, రకరకాల చేపలు ఒకటేమిటి అన్ని రకాల ప్రాణులూనూ. కథలో భాగంగా వాటిని మలచిన తీరు అద్భుతం, అమోఘం.
అసలు వాటి కదలికలనయితే ఎంత బాగా అనుకరించగలిగారో చూస్తే గానీ అర్థమవదు. ఉదా: జెల్లీ ఫిష్ అనేది ఒక పారదర్శక మైన ప్రాణి. అది కదిలే తీరు మిగతా ప్రాణులకి చాలా భిన్నం. వేళ్ళడే పోగుల్లాంటి అవయవాలతో అది భలే చిత్రంగా సాగుతుంది. సినిమాలో దానిని తీసిన తీరు మైండ్ బ్లోయింగ్.
అసలు మిస్సవకూడని సినిమాలలో ఇది కూడా ఒకటి.
No comments:
Post a Comment