83వ అంతర్జాతీయ ఆస్కార్ ఆకాడమీ అవార్డులలో ఈ చిత్రం ఉత్తమ యానిమేటెడ్ ఫిలింగా నిలిచింది. అలాగే బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి కూడా అవార్డు దక్కించుకోవడం విశేషం. ఇదేగాక పలు అంతర్జాతీయ వేదికలపై ఉత్తమ అవార్డులను దక్కించుకుంది. హికప్ అనే టీనేజ్ కుర్రాడిచుట్టూ ఈ చిత్రం కథ తిరుగుతుంది. 2010 మార్చిలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయి కలెక్షన్లలో వినూత్న ప్రభంజనం సృష్టించింది. 500 మిలియన్ డాలర్లు సంపాదించి ఈ చిత్రం వసూళ్ల పరంగా నూతన అధ్యాయాన్ని సృష్టించింది. ‘ష్రెక్’ సినిమా తర్వాత డ్రీమ్‌వర్క్‌స యానిమేషన్ సంస్థకు అత్యంత కలెక్షన్లు సాధించిపెట్టిన సినిమాగా ఇది నిలిచింది.
3డిలో చూడలేనివారికి కూడా చాలా డెప్త్‌తో 3డి చూసిన అనుభూతి కలుగుతుంది ఈ చిత్రం చూశాక. కొన్ని సీన్లు చూస్తూంటే ఈ విశాల విశ్వంలో యానిమేషన్ సాధించిన ప్రగతి మనకు ప్రస్పుటంగా కనిపిస్తుంది. కథాపరంగా చూస్తే హికప్ హీరో.. వైకింగ్ జాతికి చెందిన వాడు.. మిగతా జాతితో కలసి ఓ చక్కని ద్వీపంలో నివసిస్తుంటాడు. అందరూ మహా బలవంతులే ఒక్క తాను తప్ప. వాళ్ళ నాన్నకి కూడా నమ్మకం ఉండదు. వీరికి ఉన్న ఒకే ఒక్క సమస్య.. డ్రాగన్ దాడి. అవి వచ్చినప్పుడల్లా మంటలు, చంపుకోవడాలు మామూలే. ఈ గొడవలో హికప్‌ని రానివ్వరు. అయినా ఓసారి ఎలాగో చొరబడి ఓ డ్రాగన్‌ని అటాక్ చేసి ఓ ఆయుధం ద్వారా బంధిస్తాడు. కానీ అతడు చెప్పేదానిని ఎవ్వరూ నమ్మకు పైగా అపహాస్యం చేస్తారు.
తను టూత్‌లెస్ దగ్గర నేర్చుకున్న ట్రిక్స్‌తో అన్నిటినీ మచ్చిక చేసుకుని అక్కడి జాతి వారితో హీరోగా కొనియాడబడతాడు, ఆస్ట్రిడ్, హీరోయిన్ తనుకూడా ఫైట్‌లో శిక్షణ తీసుకుంటూంటుంది. ఓ రోజు హికప్‌ని వెంబడించి రహస్యం తెలుసుకుంటుంది. అనుకోకుండా ఇద్దరు కలసి టూత్‌లెస్ మీద కూర్చుని స్వారీచేస్తారు. అప్పుడు అసలు క్వీన్ డ్రాగన్ గుహను వాళ్లిద్దరూ చూస్తారు. మిగతా డ్రాగన్‌లు దాని బానిసలని తెలుస్తుంది. కిందికి దిగిన ఆస్ట్రిడ్, హికప్ చెంప మీద కొడుతుంది ఇది నన్ను కిడ్నాప్ చేసినందుకు అని వెంటనే ముద్దు పెట్టి ఇది మిగతా అన్ని విషయాలకు అని. వాళ్ళ నాన్న ముందు ఓ డ్రాగన్ ఫైట్‌లో ఓడిపోతాడు.
అప్పుడు వాళ్ళ నాన్నకి అసలు విషయం తెలిసి క్వీన్ డ్రాగన్ మీద యుద్ధం ప్రకటిస్తాడు. కానీ ఓటమి అంచు కొచ్చేస్తాడు. అప్పుడు యువత మిగతా డ్రాగన్‌లతో కలసి క్వీన్ బీ ని చంపేసి, వాటితో కలసి సహజీవనం సాగించటంతో సినిమా సుఖాంతం అవుతుంది ఓ చివుక్కుమనే విషయంతో. సినిమా పూర్తవ్వగానే మనస్పూర్తిగా చప్పట్లు కొడతారు పిల్లలు ఈ చిత్రం చూసిన ఆనందంలో. జే బరూచెల్, అమెరికా ఫెరెరా, గెరార్డ్ బట్లర్ ముఖ్య వాయిస్ సపోర్ట్.డ్రాగన్‌లు మాట్లాడలేదు యాక్షన్ తప్ప. డీమ్ వర్క్స వారి తయారీ. రిలయన్స్ పేరు ఎక్కడా కనబడలేదు. యానిమేషన్‌లో ఓ కొత్త ఒరవడిని సృష్టించగల సినిమా ఇది. క్రిష్టోఫర్ సాండర్స్, డీన్ డిబ్లాయిస్ డైరెక్ట్ చేశార్. ఇదే పేరుతో వచ్చిన క్రెసీడా కొవెల్ నవలకి రూపాంతం.
No comments:
Post a Comment