Friday, September 19, 2014

'ది లయన్‌ కింగ్‌'

'ది లయన్‌ కింగ్‌' అన్ని వయస్సుల వారినీ ఎంతగానో అలరిస్తోంది. కాలానికి అతీతమైన డిస్నీ క్లాసిక్‌ ఇది.
ఓ చిన్న సింహం పిల్ల పెరిగి పెద్దవడం, రాజ్యాధికారాన్ని సాధించుకోవడం ఈ సినిమా ప్రధానాంశం. బెస్ట్‌ మోషన్‌ పిక్చర్‌ (మ్యూజికల్‌ / కామెడీ)గా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు పొందింది.

అనగనగా పెద్ద అడవి సామ్రాజ్యం. సింహరాజుగారు దాన్ని పాలిస్తుంటాడు. పేరు ముఫాస. రాణిగారు సరబి. వాళ్ల్లకో కొడుకు పుడతాడు. సింబా అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుతుంటారు. ‘భావి రాజువు నువ్వే’ అని సింహరాజు ఒకరోజు తన కొడుకు సింబాను వెంటబెట్టుకుని తమ సరిహద్దులను చూపిస్తుంటాడు. సినిమా అన్నాక విలనుండాలిగా? వాడే స్కార్‌. వీడు ఎవరో కాదు సింహరాజు తమ్ముడే. అంటే యువరాజావారి బాబాయేనన్నమాట. ఇతడు అన్న కుటుంబాన్ని అంతమొందించాలని పన్నాగం పన్నుతాడు.

LionKingWallpaperఅందుకోసం శత్రువులైన హైనా రాజ్యంతో చేయిగలుపుతాడు. హైనాల గుంపులో చిేక్కలా చేసి సింహరాజు ముఫాసను చంపిస్తాడు. అన్న మరణానికి యువరాజు సింబానే కారణమని తప్పుడు ప్రచారం చేసి యువరాజును రాజ్యం నుంచి తరిమేసి రాజైపోతాడు. పాపం! మన హీరో సింబాగారు గాయాలపాలై ఎక్కడో లోయలో పడిపోతాడు. ఆ సింబాను టిమోన్‌, పుంబాలు కాపాడతారు. వీళ్లెవరో తెలుసా? ఓ ముంగిస, అడవి పంది. కాపాడ్డమేకాదు సింబాకు అన్ని విద్యలూ నేర్ఫిస్తారు. కథలో హీరోయిన్‌ ఉండాలిగా? ఆమే సివంగి నలా. మధ్యలో యుగళ గీతాలు కూడా ఉన్నాయి. ఇక మిగిలింది ెక్లైమాక్స్‌. సింబా మళ్లీ తన రాజ్యానిెకళ్లి దుర్మార్గుడైన బాబాును ఓడించి, అన్నను చంపించింది తానేనని ప్రకటించేలా చేస్తాడు.
చాలా హాలీవుడ్ సినిమాలకి ఈ రోజుకీ కథారచయిత షేక్స్‌పియర్ అవడం విశేషం. హేమ్లెట్, రోమియో అండ్ జూలియట్ లాంటి అతని నాటకాలని హాలీవుడ్‌లో మళ్లీ మళ్లీ తీసారు. కొందరు అదే కథని తిరగరాయించి పేర్లు, సందర్భాలు మార్చి వేరే సినిమాగా తీసారు. ‘ది లయన్ కింగ్’ అనే వాల్ట్ డిస్నీ కార్టూన్ సినిమా కథకి ఆధారం హేమ్లెట్! ఓ రాజుగారిని అతని సోదరుడే చంపడం, తండ్రి ఆత్మ ఆ రహస్యం చెప్పడంతో కొడుకు తన బాబాయ్ మీద పగ తీర్చుకోవం హేమ్లెట్ కథాసారాంశం.
లయన్ కింగ్‌కి హేమ్లెట్‌కి గల తేడా మనుషులు, జంతువులు మాత్రమే. మరో తేడా అయిన క్లైమాక్స్‌లో పగతో హత్య చేయకపోవడానికి కారణం ‘లయన్ కింగ్’ని చూసేది ప్రధానంగా పిల్లలే అని. 

No comments:

Post a Comment