రెమి అనే ఎలక రకరకాల మురుక్కాలవలలో మునిగి, తేలి చివరకి పారిస్
వస్తుంది. లింగ్వినీ అనే వాడితో పరిచయం చేసుకుంటుంది. పారిస్‌లో పేరుపొందిన
ఒక రెస్టారెంట్ వంశ పారంపర్యంగా లింగ్వినీ కి వస్తుంది. అయితే,
లింగ్వినీకి వంట గురించి ఓ న మా లూ కూడా తెలియవు. రెమి మామూలు ఎలకల్లా ఏ
చెత్త పడితే ఆచెత్త తినే ఎలక కాదు. నోటికి మంచి రుచి అంటే ఏమిటో తెలిసిన
ఎలక రెమి. అంతే కాదు, మంచి భోజనం కావాలంటే మంచిగా వండటం రావాలని నమ్మిన ఎలక
రెమి. చప్పుడు చెయ్యకండా మెల్లిగా రెమి లింగ్వినీపెట్టుకున్న తెల్ల టోపీ
లో చేరి, లింగ్వినీ జుత్తు పట్టుకొని ఆడిస్తూ, రకరకాల పిండివంటకాలు
అద్భుతంగా చేయిస్తుంది.
ఇలా ఉండగా పరమ కర్కోటకుడు, రెస్టా రెంట్ సమీక్షకుడు, యాంటాన్ ఈగో లింగ్వినీ రెస్టారెంట్ కి వస్తున్నాడని వార్త రాంగానే రెమికి కంగారు పెరుగుతుంది. ఈ విషమ సమస్య పరిష్కారం కోసం, రెమి తన బంధువులనీ, స్నేహితులనీ సహాయం చెయ్యమని అడుగుతుంది. ఈ గడ్డుసమస్య నుంచి తనని కాపాడమని అర్థిస్తుంది. అడిగిన తడవుగానే, జంతువులన్నీ హుటాహుటిన వస్తాయి. మరి వంటగదిలోకి అతి పరిశుభ్రంగా రావాలిగదా! అందులోనూ ప్రసిద్ధికెక్కిన ఫ్రెంచ్ రెస్టారెంటాయిరి! సమీక్ష చెయ్యడానికి వచ్చేవాడు యాంటాన్ ఈగో! అన్ని జంతువులూ డిష్‌వాషర్‌లో వేడివేడి నీళ్ళతో ‘స్నానం’ చేసి, వేడివేడిగా పొగలుకక్కే ఆవిరితో బయటకొచ్చి చకచక వాటివాటి స్థానాలకి క్లాక్‌వర్క్ లా సర్దుకుం టాయి. ఇదీ, క్లుప్తంగా, యానిమేషన్ సినిమా రాటటూయీ (Ratatouille) కథ. ఫ్రెంచ్ కిచెన్, ఫ్రెంచ్ వంటలు, వంట పరికరాలూ, అత్యద్భుతంగా అతిచాకచక్యంగా చిత్రించబడ్డ ఫాంటసీ. ఆభూతకల్పన! ఫాంటసీయే కానీ చూస్తున్నంతసేపూ, ప్రేక్షకులు పారిస్ రెస్టారెంట్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఎంత తెలివి గల ఎలకలైనా, ఎంత నాగరికమైన రుచులు తెలిసినా, ఫ్రెంచ్ షెఫ్‌లు కాలేవు కదా! అయితే ఒక గంటన్నరసేపు ఈ ఫాంటసీ ప్రేక్షకులని ఆకట్టేసుకుంటుంది! అసంభవం అని తెలిసికూడా ఆ కొద్దిసేపూ మనం ఆనందించగలం.

No comments:
Post a Comment