Friday, September 19, 2014

ది కలర్ ఆఫ్ ప్యారడైజ్


the-color talangana patrika telangana culture telangana politics telangana cinemaఈ సినిమా పిల్లలకు, పెద్దలకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. కన్న తండ్రి తన గుడ్డివాడైన కొడుకుపై చూపించే ద్వేషం, అతన్ని వదిలించుకోవాలని తండ్రి చేసే ప్రయత్నమే ఈ సినిమా! అతని ఆలోచనలు ఎంత స్వార్థంగా ఉంటాయో స్పష్టంగా కనపడుతుంది.

ఈ సినిమా హీరో మహ్మద్. కథ విషయానికోస్తే.... హీరోచిన్నతనంలోనే తల్లి చనిపోతుంది. ఇద్దరు అక్కలు, నాన్నమ్మతో అతను ఆనందంగా ఉంటుంటాడు. మహ్మద్ అంధుడు. టెహారాన్‌లో ఒక స్పెషల్ స్కూల్లో చదువుతుంటాడు. సమ్మర్ వెకెషన్‌లో, అందరి తల్లిదంవూడులు వచ్చి వాళ్ల పిల్లలను తీసుకెళ్తుంటారు. కానీ మహ్మద్‌ని తీసుకెళ్లడానికి ఎవరు రారు. అతనొక్కడే బయట నిలుచుని చూస్తుంటే చివరికి వాళ్ల నాన్న హాశెం వస్తాడు. అసలు మహ్మద్‌ని తన వెంట తీసుకెళ్లడం ఆయనకు ఇష్టం ఉండదు. స్కూల్ యాజమాన్యాన్ని అడుగుతాడు హాశెం. సమ్మర్ వెకెషన్‌లో కూడా మహ్మద్‌ను వాళ్ల దగ్గరే ఉంచుకోమని, దానికి వాళ్లు నిరాకరించడంతో అతన్ని ఇంటికి తీసుకెళ్తాడు. మహ్మద్ తల్లి చనిపోవడంతో ఇంకొ పెళ్లి చేసుకోవాలనుకుంటాడు హాశెం. అతని ప్రయత్నాల్లో అతను ఉంటాడు.

ఒక పక్క మహ్మద్ అతని అక్కలతో కొండలపై, తోటల్లో తిరుగుతూ రకరకాల పక్షులు, జంతువులు చేసే చప్పుళ్లను వింటూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటాడు. అక్కలతో స్కూల్‌కి వెళ్తూ అతని దగ్గరున్న పుస్తకాలు చదువుతూ అక్కడి ఉపాధ్యాయుల, విద్యార్థుల మనసు గెలుచుకుంటాడు.

హాశెం మాత్రం తనకు ఒక గుడ్డి కొడుకున్నాడని తను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కుటుంబానికి తెలిస్తే పెళ్లికి ఒప్పుకోరని కొడుకుని తీసుకెళ్లి పని నేర్పించమని అంధుడైన వడ్రంగికి అప్పగిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న మహ్మాద్ నాన్నమ్మ ముద్దుల మనవడు మీద బెంగతో ఆమె ఆనారోగ్యం పాలై చనిపోతుంది. ఇది తెలసిన అమ్మాయి కుటుంబం హాశెం పెళ్లికి నిరాకరిస్తారు. ఇదంతా జరిగిన తరువాత హాశెం మహ్మద్‌ను తీసుకురావడానికి వెళ్తాడు. అతన్ని గుర్రంపై ఎక్కించుకొని వస్తుండగా మార్గమధ్యలో విరిగిన వంతెన కనిపిస్తుంది. ఎలాగైనా మహ్మద్ వదిలించుకోవాలనుకుంటాడు హాశెం. చివరికి ఏం జరుగుతుంది? మహ్మద్ తండ్రి హాశెం అతని వదిలించుకుంటాడా? లేదా? తండ్రికొడుకుల అనుబంధానికి ముగింపు ఏమిటనేది మిగితా సినిమా.......!

No comments:

Post a Comment