Friday, September 19, 2014

ష్రెక్:


 నాకు బాగా నచ్చిన అన్ని సినిమాలలోనూ ష్రెక్ ఒకటి. కథ మనం చాలా ఫెయిరీ టెయిల్స్ లో విన్నదే. అగ్లీ హీరో, బ్యూటీఫుల్ హీరోయిన్, ఫాల్ ఇన్ లవ్ లాంటిదన్నమాట.
ష్రెక్ అనే ఓగర్, ఫియోనా అనే ప్రిన్సెస్ ఎలా ప్రేమలో పడతారో, వారి స్నేహితులయిన డాంకీ, పిల్లి తో కలిసి చేసే ప్రయాణంలో ఎలాంటి ఆపత్తులని ఎదుర్కొన్నారో అన్నదే కథ.
ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం. నిజంగానే అద్భుతం సృష్టించగలిగారు ఈ సినిమాలో. అసలు రొమాన్సు, ప్రేమ లాంటి ఫీలింగులని మామూలు నటులతోనే కల్పించడం కష్టం అనుకుంటే యానిమేషను సినిమాలో దీనిని చిత్రించగలగడం అదీ మనిషి కాని ఒక ఓగర్‌తో కలిసి అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.
ఈ సినిమా యానిమేషను సినిమాలలో ఒక మైలురాయి వంటిది అని చెప్పుకోవచ్చు.

No comments:

Post a Comment