Friday, September 19, 2014

"The Breakfast Club" …


 “The Breakfast Club” సినిమా పరిచయం అయ్యింది. 1985 లో తీసినా ఇప్పటి పరిస్థితులకీ అన్వయించగలిగే సినిమా అది.
అయిదుగురు హై స్కూల్ విద్యార్థులకి డిటెన్షన్ ఇవ్వబడుతుంది. వారయిదుగురూ ఆ వారాంతంలో స్కూలుకి వస్తారు.
అందులో అయిదుగురిదీ వేరువేరు మనస్థత్వాలు. ఒకరు రెక్లెస్ గా, ఒకరు స్టైలిష్ గా, ఒకరు స్టూడియస్ గా, ఒకరు ఇంట్రావర్ట్ గా, ఒకరు సక్సస్‌ఫుల్ స్పోర్ట్స్మన్ గా పరిచయమవుతారు.
ఎవరికీ వేరేవారితో ఎందులోనూ సరిపోదు. వారందరినీ వారి ప్రిన్సిపాల్ గమనిస్తుంటాడు.
ఇక కథంతా వారు ఏ విధంగా ఆ డిటెన్షన్ గడిపారు అనేది.
పైన కనిపించే వారి మనస్థత్వాల కింద అసలు స్వభావం ఏంటి? ఎందుకు వారలా ప్రవర్తిస్తున్నారు అనేది ఎంతో హత్తుకునేలా ఉంటుంది. పిల్లల మీద తల్లిదండ్రులు ఏ విధంగా అనవసరమయిన ఒత్తిడి తెస్తారో, అందువల్ల సైడ్ ఎఫెక్ట్స్, వారికి ఎలా ఎవరితో తమ బాధ చెప్పుకోవాలో తెలీక వారిలో వారు ఎలా కుమిలిపోతుంటారో ఎంతో చక్కగా ఈ సినిమాలో బంధించగలిగాడు దర్శకుడు. అంతే కాక ఇంట్లో సరయిన వాతావరణం లేకపోతే పిల్లల మీద అది ఎలా ప్రభావం చూపుతుందో కూడా చెబుతాడు.
కుదిరితే తప్పకుండా చూడవలసిన సినిమాల లిస్టులో ఇది కూడా ఉంటుంది.
నా రేటింగ్: 4.5/5

No comments:

Post a Comment