“Wall-E” అన్నది ఓ రోబో. Waste Allocation Load Lifter-Earth class అన్నది దాని పూర్తి పేరు. మనుష్యుల పనుల ధాటికి భూమి un liveable గా తయారవడంతో 22వ శతాబ్దంలో అప్పటికే భూమిపై ఉన్న మొత్తం ఆర్థిక వ్యవస్థనీ కంట్రోల్ చేస్తున్న బయ్ అండ్ లార్జ్ (BnL) కార్పోరేషన్ అంతరిక్షంలో తాను సృష్టించిన మరో ప్రపంచం Axiom లోకి మనుషుల్నందర్నీ తరలించేస్తుంది. ఏడొందల సంవత్సరాలు గడిచిపోతాయి. భూమిపై ప్రాణం ఉండగలదు అన్న విషయం నిశ్చయంగా తెలిస్తే కానీ వెనక్కి రాకూడన్నది బయ్ అండ్ లార్జ్ వారి ఆలోచన. Wall-E రోబోలు చెత్త శుభ్రం చేసేవి. ఈ ఏడొందల సంవత్సరాల కాలంలో ఒకే ఒక రోబో మిగులుతుంది. అది రోజంతా చెత్త శుభ్రం చేస్తూ, వాటిలో ఏవన్నా వస్తువులు తనని ఆకర్షిస్తే వాటిని దాచుకుంటూ కాలం గడుపుతూ ఉంటుంది. రోజులిలా సాగుతూ ఉండగా Axiom నుండి భూమిపై చెట్టు మొలచే అవకాశం ఉందేమో తెలుసుకోవాలన్న పనిమీద eve అనే ఆడ రోబో ని పంపిస్తారు. Wall-E ఈవ్ ప్రేమలో పడుతుంది. క్రమంగా ఈవ్ కి కూడా Wall-E ఇష్టం ఏర్పడుతుంది. తనకు ఎప్పుడో కనిపిస్తే దాచుకున్న ఓ మొక్కను ఈవ్ కి ఇవ్వగానే, ఈవ్ డీ-ఆక్టివేట్ ఐపోతుంది. దాన్ని తీసుకోవడానికొచ్చిన ఆక్సియం స్పేస్ షిప్ తో రహస్యంగా వాల్-ఈ కూడా వెళ్ళిపోతుంది. ఇక మిగితా కథంతా అక్కడి జీవితం, వాల్-ఈ ఏం చేసింది? వీళ్ళిద్దరి మధ్యా సంబంధం ఏమైంది? భూమ్మీద మళ్ళీ ప్రాణి అన్నది అడుగుపెట్టిందా? అన్నది.
పాత్రల ఆహార్యంలో పిక్సార్ శ్రద్ధకీ, వారు సాధించిన పర్ఫెక్షన్ కీ వారిని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రకరకాల రోబోలు – ఒక్కో రకానికీ ఒక్కో వేషధారణా, ఒక్కో మేనరిజం. మనుష్యుల్లేనీ, చెత్త మాత్రమే ఉన్న భూమి సెట్, యాక్సియంలోని వివిధ భాగాల సెట్ – రెండూ కూడా చాలా సహజంగా కుదిరాయి. అది యానిమేషన్ అన్న భావన కూడా కలగలేదు నాకైతే. పాత్రల మధ్య మొదటి సగంలో పెద్ద మాటలేమీ లేవు. రెండో సగంలో కూడా axiom లోని మనుష్యులు మాట్లాడేవే. చాలా వరకు మాటల్లేకుండానే కథ నడుస్తుంది. సైగల్లో, కళ్ళతోనే. అయినప్పటికీ అద్భుతంగా తీసారు. ఆద్యంతమూ చాలా మంచి హాస్యం. సినిమా హాలు నవ్వుల్తో దద్దరిల్లుతూనే ఉండింది. వాల్-ఈ ఈవ్ ని “ఈవా” అంటూ పిలిచే సన్నివేశాలన్నీ అద్భుతం. దానికి భయమేసినప్పుడు అది ప్రవర్తించే విధానం కూడా భలే ఉంటుంది. ఈ సినిమాతో పాటు పిక్సార్ వారు “ప్రెస్టో” అన్న లఘు చిత్రాన్ని కూడా విడుదల చేసారు. సినిమా మొదలయ్యే ముందు వస్తుంది అది. అది కూడా చాలా బాగా తీసారు. ఆద్యంతం హాస్యపు జల్లే. ఈ సినిమాలో పెద్దగా సంభాషణలు లేకపోవడం గురించి దీనికి Executive producer, స్వయంగా టాయ్ స్టోరీ ద్వయం, కార్స్ వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన జాన్ లాసెటర్ జవాబు: “the art of animation is about what the character does, not what it says. It all depends on how you tell the story, whether it has a lot of dialogue or not.” ఈ జవాబు చదివాక పిక్సార్ పై గౌరవం మరింత పెరిగింది. Every frame of the movie was thoroughly enjoyable. చూడ్డం లైట్ తీసుకునే సినిమాలు చాలా ఉంటే ఉండొచ్చు గాక. ఇది ఆ కోవ కాదు. మిస్ చేస్తే ఏదో మిస్సయ్యే తరహా సినిమా.
పిక్సార్ వారి యానిమేషన్లకీ తక్కిన యానిమేషన్లకీ ప్రధానమైన తేడా కథ దగ్గరే మొదలౌతుందని నా అభిప్రాయం. ప్రతి కథలోనూ ఓ సామాజిక కోణం అంతర్లీనంగా ఉండే ఉంటుంది. ఒక విధంగా ఆలోచిస్తే, ఇందులో పెరుగుతున్న కాలుష్యం గురించిన ఆలోచనలోని సామాజిక కోణమే కాక, జీవితం అతి సౌకర్యవంతమైనపుడు మనుష్యుల శరీరాల్లో తలెత్తే సమస్యల గురించిన ఆందోళన, Too much of machines వల్ల పరిణామాలు వంటి విషయాలని కూడా స్పృశించే ప్రయత్నం చేసినట్లు తోస్తుంది. ఇక, రోబోల మధ్య ప్రేమ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి, రోబోలను మనిషి స్వభావానికి దగ్గరగా తెచ్చే కల కనిపిస్తుంది. నేటి సై-ఫై కలలు రేపటి సైన్స్ అన్న కాన్సెప్ట్ ప్రకారం, CERN లాంటి సంస్థల బిగ్-బ్యాంగ్ పరిశోధనల నేపథ్యంలో ఒకరోజు అది కూడా జరుగుతుందేమో…ఎవరికి ఎరుక!
ఒకే ఒక్క బాధించే విషయం ఏమిటీ అంటే, ఎప్పుడో జూన్-జులై లో సినిమా రిలీజైతే మన హైదరాబాద్ కి రావడానికి సెప్టెంబర్ దాకా సమయం తీసుకోవడం! ఆన్లైన్ లో కూడా చాలారోజుల్నుంచీ దొరుకుతోంది. అలాంటప్పుడు ఇక్కడ సినిమా రిలీజ్ చేయడానికి ఇన్నాళ్ళు చేయడం అన్యాయం ! అక్రమం! ఇది నేరం! ఇది ఘోరం! x-(
No comments:
Post a Comment